Telugu Global
NEWS

ఆఖరి టీ-20లో భారత్ కు సఫారీల షాక్

కొహ్లీ కొంపముంచిన మితిమీరిన ఆత్మవిశ్వాసం 1-1తో డ్రాగా ముగిసిన సిరీస్ కెప్టెన్ విరాట్ కొహ్లీ మితిమీరిన ఆత్మవిశ్వాసం భారత్ కొంపముంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ-20లో భారత్ ను సౌతాఫ్రికా 9 వికెట్లతో చిత్తు చేసి 1-1తో సిరీస్ ను సమం చేసి..సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఆఖరి టీ-20లో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా కొహ్లీ దుస్సాహసమే చేశాడు. చేజింగ్ కు అత్యంత అనువుగా ఉండే […]

ఆఖరి టీ-20లో భారత్ కు సఫారీల షాక్
X
  • కొహ్లీ కొంపముంచిన మితిమీరిన ఆత్మవిశ్వాసం
  • 1-1తో డ్రాగా ముగిసిన సిరీస్

కెప్టెన్ విరాట్ కొహ్లీ మితిమీరిన ఆత్మవిశ్వాసం భారత్ కొంపముంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి టీ-20లో భారత్ ను సౌతాఫ్రికా 9 వికెట్లతో చిత్తు చేసి 1-1తో సిరీస్ ను సమం చేసి..సమఉజ్జీగా నిలిచింది.

సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఆఖరి టీ-20లో కీలక టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోడం ద్వారా కొహ్లీ దుస్సాహసమే చేశాడు.

చేజింగ్ కు అత్యంత అనువుగా ఉండే బెంగళూరు పిచ్ పై ముందుగా బ్యాటింగ్ కు దిగడం ద్వారా ఘోరపరాజయం కొని తెచ్చుకొన్నాడు.

భారత్ టపటపా…

హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ …ముందుగా బ్యాటింగ్ కు దిగినా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ చెరో 9 పరుగులు మాత్రమే చేయగలిగారు.

సఫారీ ఫాస్ట్ బౌలర్ హెండ్రిక్స్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రబాడా 3వికెట్లు సాధించాడు

డి కాక్ వీరవిహారం…

సమాధానంగా 135 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు ఓపెనర్లు డీ కాక్, హెండ్రిక్స్ మొదటి వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

కెప్టెన్ డీ కాక్ 52 బాల్స్ల్ లో 6 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 79 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. కేవలం 16.5 ఓవర్లలోనే సఫారీ టీమ్ ఓపెనర్ హెండ్రిక్స్ వికెట్ నష్టానికే విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్ ను 1-1తో సమం చేయగలిగింది.

సఫారీ బౌలర్ హెండ్రిక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ డీ కాక్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

First Published:  22 Sep 2019 10:37 PM GMT
Next Story