Telugu Global
Cinema & Entertainment

అనిరుద్ బాటలో.... థమన్

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్ల విషయంలో దర్శకనిర్మాతలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు చాలా వరకు ప్రమోషన్ల మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లో ఇప్పుడు సంగీత దర్శకులు కూడా ప్రమోషన్ల ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ప్రమోషన్ పాటల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్ ఈ మధ్యనే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రమోషనల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. […]

అనిరుద్ బాటలో.... థమన్
X

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్ల విషయంలో దర్శకనిర్మాతలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఓపెనింగ్ కలెక్షన్లు చాలా వరకు ప్రమోషన్ల మీద డిపెండ్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో లో ఇప్పుడు సంగీత దర్శకులు కూడా ప్రమోషన్ల ను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.

తాజాగా ఇప్పుడు ప్రమోషన్ పాటల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ రవిచందర్ ఈ మధ్యనే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రమోషనల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది.

ఇంతకుముందు ‘యు టర్న్’ సినిమాలో కూడా అనిరుద్ రవిచందర్ ఒక ప్రమోషనల్ పాట చేశారు. తాజాగా ఇప్పుడు థమన్ కూడా ఇదే రూట్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం థమన్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడట. సినిమా ప్రమోషన్స్ కి ఉపయోగపడేలా ఈ పాటని గ్రాండ్ గా షూట్ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో బయటకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  24 Sep 2019 3:00 AM GMT
Next Story