Telugu Global
National

వారసులకు నో టికెట్: బిజెపి అధిష్టానం

75 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వమని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఇకముందు జరిగే ఎన్నికల్లో పార్టీలో సీనియర్ నాయకుల వారసులకు టికెట్లు ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించింది. గత లోక్ సభ ఎన్నికలలో 75 సంవత్సరాలు నిండిన సీనియర్ నాయకులు ఎవరూ పోటీ చేయకుండా టికెట్లు నిరాకరించింది బిజెపి అధిష్టానం. ఈ నిర్ణయంతో పార్టీకి మూలస్థంభాలైన ఎల్.కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ […]

వారసులకు నో టికెట్: బిజెపి అధిష్టానం
X

75 సంవత్సరాలు పైబడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వమని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా మరో నిర్ణయాన్ని తీసుకుంది.

ఇకముందు జరిగే ఎన్నికల్లో పార్టీలో సీనియర్ నాయకుల వారసులకు టికెట్లు ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించింది. గత లోక్ సభ ఎన్నికలలో 75 సంవత్సరాలు నిండిన సీనియర్ నాయకులు ఎవరూ పోటీ చేయకుండా టికెట్లు నిరాకరించింది బిజెపి అధిష్టానం.

ఈ నిర్ణయంతో పార్టీకి మూలస్థంభాలైన ఎల్.కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నాయకులు గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

తాజాగా హర్యానా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇవ్వరాదని బిజెపి రాష్ట్ర శాఖలు ప్రకటించాయి. వారసులకు టికెట్లు ఇవ్వరాదన్న నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల్లోనూ అమలు చేసి ఆ తర్వాత దేశ వ్యాప్తంగా జరిగే అన్ని ఎన్నికల్లోనూ అమలు చేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.

“పార్టీలో యువ రక్తాన్ని నింపడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది” అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

అయితే పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈరోజు పార్టీ ఇంత ఎదగడానికి కారణమైన సీనియర్లను పక్కన పెట్టడమే కాకుండా వారి వారసులు కూడా పార్టీలో లేకుండా చేయాలనుకోవడం నియంతృత్వ పోకడలేనని సీనియర్ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  24 Sep 2019 12:26 AM GMT
Next Story