Telugu Global
NEWS

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పైపైకి...

దారుణంగా పడిపోయిన కొహ్లీ టీమ్ బ్రాండ్ వాల్యూ భారత దేశవాళీ టీ-20 లీగ్ ఐపీఎల్ బ్రాండ్ విలువ…ఏడాది ఏడాదికీ పెరిగిపోతూ వస్తోంది. అయితే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్, షారుక్ ఖాన్ కో-ఓనర్ గా ఉన్నకోల్ కతా నైట్ రైడర్స్ జట్ల బ్రాండ్ వాల్యూ మాత్రం దారుణంగా పడిపోయినట్లు డుఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 47వేల 500 కోట్లకు పెరిగిన బ్రాండ్… ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ 2008లో ప్రారంభించిన […]

ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పైపైకి...
X
  • దారుణంగా పడిపోయిన కొహ్లీ టీమ్ బ్రాండ్ వాల్యూ

భారత దేశవాళీ టీ-20 లీగ్ ఐపీఎల్ బ్రాండ్ విలువ…ఏడాది ఏడాదికీ పెరిగిపోతూ వస్తోంది. అయితే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్, షారుక్ ఖాన్ కో-ఓనర్ గా ఉన్నకోల్ కతా నైట్ రైడర్స్ జట్ల బ్రాండ్ వాల్యూ మాత్రం దారుణంగా పడిపోయినట్లు డుఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

47వేల 500 కోట్లకు పెరిగిన బ్రాండ్…

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ 2008లో ప్రారంభించిన ఐపీఎల్ గత 11 సీజన్లుగా అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ వస్తోంది.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన లీగ్ గా గుర్తింపు తెచ్చుకొంది.

తాజా అధ్యయనం ప్రకారం…ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 7 శాతం మేరకు పెరిగింది. డాలర్ల ప్రకారం చూస్తే…6.3 బిలియన్ల నుంచి 6.8 బిలియన్ డాలర్లకు బ్రాండ్ విలువ పెరిగింది.

అదే మన రూపాయలలో చూస్తే…గత సీజన్లో 41వేల 800 కోట్లుగా ఉన్న విలువ కాస్త..2019 సీజన్లో 47 వేల 500 కోట్ల రూపాయలకు చేరింది.

ముంబై ఫ్రాంచైజీ టాప్…

ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ మాత్రం మిశ్రమఫలితాలతో సాగుతోంది. నాలుగుసార్లు ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ జట్టు బ్రాండ్ విలువ 8.5 శాతం మేరకు పెరిగింది. ప్రస్తుతం ముంబై ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ 809 కోట్ల రూపాయలుగా నమోదయ్యింది.

రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ లో పునరాగమనం చేయటమే కాదు..రన్నరప్ స్థానం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం తన బ్రాండ్ విలువను అంచనాలకు మించి పెంచుకోగలిగింది.

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ 13.1 శాతం మేర బ్రాండ్ విలువ పెంచుకోడంతో…732 కోట్ల రూపాయల ఫ్రాంచైజీగా అవతరించగలిగింది.

ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో చెన్నై కొనసాగుతోంది.

బెంగళూరు, కోల్ కతా వెలవెల..

ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కో-ఓనర్ గా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల బ్రాండ్ విలువ సీజన్ సీజన్ కూ పడిపోతూ వస్తోంది.

బెంగళూరు, కోల్ కతా ఫ్రాంచైజీలు 8 శాతం మేర బ్రాండ్ విలువను కోల్పోయాయి. కోల్ కతా ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ 630 కోట్ల రూపాయలుగా ఉంటే… బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 595 కోట్ల రూపాయలకు దిగజారిపోయింది.

విరాట్ కొహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడున్నా…బెంగళూరు జట్టు గత రెండుసీజన్లలోనూ నాకౌట్ రౌండ్ చేరలేకపోయింది. బెంగళూరు బ్రాండ్ విలువను పెంచడంలో విరాట్ కొహ్లీ దారుణంగా విఫలమయ్యాడని…. ఆ జట్టు సాధించిన ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.

ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం మేరకు పెరిగింది. స్పాన్సర్ షిప్ ల ద్వారా సమకూరే ఆదాయం మాత్రం రికార్డుస్థాయిలో 58 శాతం పెరగటం విశేషం.

ప్రపంచ క్రీడారంగంలోని అత్యంత విలువైన బ్రాండ్ ల్లో ఒకటిగా మన ఐపీఎల్ నిలవడం భారత్ కే గర్వకారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  24 Sep 2019 12:00 AM GMT
Next Story