Telugu Global
National

మొదటి మహిళా అధికారిగా రికార్డ్....

ఆర్మీ ఆఫీసర్ పోనుంగ్ డోమింగ్ అరుణాచల్ ప్రదేశ్ నుండి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగిన మొదటి మహిళా అధికారిగా రికార్డ్ సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సోమవారం ఆమె విజయాలను కీర్తిస్తూ… “మనందరికీ గర్వకారణబైన క్షణం … మేజర్ పోనుంగ్ డోమింగ్ చరిత్రను సృష్టించింది. అరుణాచల్ నుండి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుకు ఎదిగిన మొదటి మహిళా ఆర్మీ ఆఫీసర్ ఆమె. ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!” అని ట్వీట్ చేశారు. […]

మొదటి మహిళా అధికారిగా రికార్డ్....
X

ఆర్మీ ఆఫీసర్ పోనుంగ్ డోమింగ్ అరుణాచల్ ప్రదేశ్ నుండి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగిన మొదటి మహిళా అధికారిగా రికార్డ్ సృష్టించింది.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు సోమవారం ఆమె విజయాలను కీర్తిస్తూ… “మనందరికీ గర్వకారణబైన క్షణం … మేజర్ పోనుంగ్ డోమింగ్ చరిత్రను సృష్టించింది. అరుణాచల్ నుండి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుకు ఎదిగిన మొదటి మహిళా ఆర్మీ ఆఫీసర్ ఆమె. ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!” అని ట్వీట్ చేశారు.

జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ కూడా ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఆమెను “సాధికారికమైన, ధైర్యవంతురాలైన మహిళ” గా అభివర్ణించారు.

“ఇదీ నిజమైన సాధికారిత అంటే. సాహసోపేతమైన మహిళ! మేజర్ పోనుంగ్ డోమింగ్ చరిత్రను సృష్టించింది. అరుణాచల్ నుండి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగిన మొదటి మహిళా ఆర్మీ ఆఫీసర్ ఆమె. హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు…” అని డోవల్ ట్వీట్ చేశారు.

మేజర్ పోనుంగ్ డోమింగ్ తూర్పు సియాంగ్ జిల్లాలోని పసిఘాట్ నివాసి. ఆమె 2005 లో మహారాష్ట్రలోని వాల్‌చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందింది. తర్వాత కోల్‌కతాలోని ఎల్ అండ్ టి కంపెనీలో చేరింది. అక్కడ ఆమె దాదాపు రెండు సంవత్సరాలు పనిచేసింది.

ఈ సమయంలో, ఆమె అలహాబాద్‌లోని సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షల కోసం తన సన్నాహాన్ని కొనసాగించింది. 2008 లో ఆమె పరీక్ష పాసై చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. లెఫ్టినెంట్‌గా సైన్యం లో చేరిన్ డోమింగ్… నాలుగున్నర సంవత్సరాలలో మేజర్ స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఇప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొంది రికార్డ్ క్రియేట్ చేసింది.

లెఫ్టినెంట్ కల్నల్ తాను సాధించిన దానికి సంతోషంగా, సంతృప్తిగా ఉన్నానని, ఇది దేశం పట్ల తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిజాయితీతో కష్టపడి పనిచేసినందున ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె అన్నారు.

రాష్ట్రంలోని ప్రతి యువత వారు ఎంచుకున్న ఏ రంగంలోనైనా చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితం ఉంటుందని అన్నారు.
మన రాష్ట్రం, దేశం కోసం చేయగలిగిన పని చేయడానికి ఏ ఒక్క వ్యక్తిని ప్రేరేపించగలిగినా నా జన్మ ధన్యమైనట్లే నని ఆమె అన్నారు.

ఏప్రిల్ 2014 లో ఆమె డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళం లో కూడా పనిచేయడం గమనార్హం.

First Published:  24 Sep 2019 4:57 AM GMT
Next Story