Telugu Global
Cinema & Entertainment

వెకేషన్ మూడ్ లో.... యంగ్ రెబల్ స్టార్

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యనే సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిన ప్రభాస్ ఇప్పుడు వెకేషన్ మూడ్ లో ఉన్నారు. ఈ మధ్యనే లండన్ నుంచి తిరిగి ఇండియాకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు వెకేషన్ పేరుతో మళ్లీ […]

వెకేషన్ మూడ్ లో.... యంగ్ రెబల్ స్టార్
X

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యనే సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమాలో నటించారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిన ప్రభాస్ ఇప్పుడు వెకేషన్ మూడ్ లో ఉన్నారు.

ఈ మధ్యనే లండన్ నుంచి తిరిగి ఇండియాకి వచ్చిన ప్రభాస్ ఇప్పుడు వెకేషన్ పేరుతో మళ్లీ పారిస్ కి వెళ్లారు. నిన్ననే ప్రభాస్ ప్యారిస్ కి వెళ్లడం జరిగింది. ఒక నెల పాటు అక్కడ సేదతీరి వచ్చేనెల ప్రభాస్ తిరిగి ఇండియాకి రానున్నాడు.

ఇక సినిమాల పరంగా ప్రభాస్ తదుపరి సినిమా రాధా కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

1970 యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక అందమైన ఫాంటసీ ప్రేమకథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చెప్పగా రాధాకృష్ణ ఆ మార్పులను చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాక ప్రభాస్ మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

First Published:  24 Sep 2019 1:03 AM GMT
Next Story