Telugu Global
Cinema & Entertainment

తరుణ్ భాస్కర్ తో వెంకటేష్....

ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా ఇప్పుడు ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య మరియు వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాకి కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో ఒక […]

తరుణ్ భాస్కర్ తో వెంకటేష్....
X

ఈ మధ్యనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా ఇప్పుడు ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్నారు.

నాగచైతన్య మరియు వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాకి కె ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వెంకటేష్ తో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ కి కూడా కథ నచ్చిందని టాక్ వినిపిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హార్స్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని మలక్ పేటలో జరుగుతుందట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో ఈ సినిమా రియలిస్టిక్ గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం.

సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

మరోవైపు త్రినాథరావు నక్కిన కూడా వెంకటేష్ హీరోగా ఒక యాక్షన్ సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నాడట. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

First Published:  24 Sep 2019 2:00 AM GMT
Next Story