Telugu Global
National

ప్రైవేట్‌కు తొలి అడుగు... రైల్వేలో ప్రైవేట్ ట్రైన్

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ప్లేయర్-ఆపరేటెడ్ తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-లక్నో మార్గంలో అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించనుంది. దీంతో ఇండియన్ రైల్వేలో కొత్త అధ్యాయానికి తెరలేచినట్లు అవుతుంది. ఆతర్వాత దేశంలో 24 మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రైళ్లు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యతో భారతీయ రైల్వే ప్రయాణీకులకు […]

ప్రైవేట్‌కు తొలి అడుగు... రైల్వేలో ప్రైవేట్ ట్రైన్
X

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ప్లేయర్-ఆపరేటెడ్ తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-లక్నో మార్గంలో అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించనుంది.

దీంతో ఇండియన్ రైల్వేలో కొత్త అధ్యాయానికి తెరలేచినట్లు అవుతుంది. ఆతర్వాత దేశంలో 24 మార్గాల్లో ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రైళ్లు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యతో భారతీయ రైల్వే ప్రయాణీకులకు “ప్రపంచ స్థాయి సేవలను” అందించగలదని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

“ప్రైవేట్ ఆపరేటర్లు ఆధునిక ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టాలని, అలాగే ఛార్జీలను చెల్లించి వారికి కేటాయించిన మార్గాల్లో వాటిని నడపాలని భావిస్తున్నాం. ఈ ప్రయోజనం కోసం రూపొందించిన రాయితీ ఒప్పందం ప్రకారం ఛార్జీలను నిర్ణయించే, వసూలు చేసే హక్కు వారికి ఉంటుంది” అని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ప్రైవేట్ ఆపరేటర్లకు ముఖ్యమైన నగరాలను అనుసంధానించే మార్గాల్లో పగలు, రాత్రి రైళ్లను నడపడానికి అనుమతి ఉంటుంది. ఈ అంశంపై తదుపరి చర్చల కోసం సెప్టెంబర్ 27 న మరో సమావేశం జరుగుతుంది.

ప్రైవేటు రైలు ఆపరేటర్లు రైళ్లు నడిపే మార్గాల జాబితాను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో ఇంటర్‌సిటీ, రాత్రిపూట నడిచేవి, సుదూరమైనవి, సబర్బన్ రైలు సర్వీసులు ఉన్నాయి.

సుదూర, రాత్రిమొత్తం నడిచే మార్గాలు… ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-లక్నో, ఢిల్లీ-జమ్మూ / కత్రా, ఢిల్లీ-హౌరా, సికింద్రాబాద్-హైదరాబాద్, సికింద్రాబాద్- ఢిల్లీ, ఢిల్లీ-చెన్నై, ముంబై-చెన్నై, హౌరా-చెన్నై, హౌరా -ముంబై.

ఇంటర్‌సిటీ మార్గాలు… ముంబై-అహ్మదాబాద్, ముంబై-పూణే, ముంబై- ఔ రంగాబాద్, ముంబై-మద్గాం, ఢిల్లీ-చండీగర్ / అమృత్సర్, ఢిల్లీ-జైపూర్ / అజ్మీర్, హౌరా-పూరి, హౌరా-టాటానగర్, హౌరా-పాట్నా, సికింద్రాబాద్-విజయవాడ, చెన్నై-బెంగళూరు, చెన్నై-కోయంబత్తూర్, చెన్నై-మదురై, ఎర్నాకుళం-త్రివేండ్రం.

ఇవి కాకుండా… ముంబై, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సబర్బన్ రైలు సర్వీసులు నడపడానికి ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం ఇవ్వాలని భారత రైల్వే యోచిస్తోంది.

అక్టోబర్ 5 న డిల్లీ-లక్నో మార్గంలో మొట్టమొదటి ప్రైవేట్ ప్లేయర్-ఆపరేటెడ్ తేజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయాన్ని రైల్వే శాఖ ప్రకటించడం గమనార్హం.

తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ ఏసి చైర్ కార్, తొమ్మిది ఏసి చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. ఇది కాన్పూర్, ఘజియాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నుండి న్యూ ఢిల్లీకి ప్రయాణానికి కౌంటర్లు తెరిచిన రెండు రోజుల్లోనే 2 వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు.

First Published:  24 Sep 2019 5:48 AM GMT
Next Story