Telugu Global
NEWS

విరాట్ కొహ్లీకి ఐసీసీ వార్నింగ్

ఆఖరి టీ-20లో అతిగా ప్రవర్తించిన భారత కెప్టెన్ భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ దూకుడుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ మరోసారి అడ్డుకట్ట వేస్తూ వార్నింగ్ ఇచ్చారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో కొహ్లీ బ్యాట్ చేస్తూ.. సఫారీ పేస్ బౌలర్ బేరాన్ హెండ్రిక్స్ తో అతిగా ప్రవర్తించడం ద్వారా క్రికెట్ ప్లేయర్ల నియమావళిని అతిక్రమించాడు. కొహ్లీ పరుగు తీస్తూ… బౌలర్ హెండ్రిక్స్ […]

విరాట్ కొహ్లీకి ఐసీసీ వార్నింగ్
X
  • ఆఖరి టీ-20లో అతిగా ప్రవర్తించిన భారత కెప్టెన్

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ దూకుడుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ మరోసారి అడ్డుకట్ట వేస్తూ వార్నింగ్ ఇచ్చారు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో కొహ్లీ బ్యాట్ చేస్తూ.. సఫారీ
పేస్ బౌలర్ బేరాన్ హెండ్రిక్స్ తో అతిగా ప్రవర్తించడం ద్వారా క్రికెట్ ప్లేయర్ల నియమావళిని అతిక్రమించాడు.

కొహ్లీ పరుగు తీస్తూ… బౌలర్ హెండ్రిక్స్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా రాసుకొంటూ వెళ్లాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి ఆటగాడిని శారీరకంగా తాకుతూ వెళ్ళటం, రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఐసీసీ నియమావళికి విరుద్ధం.

భారతజట్టుకు కెప్టెన్ గా ఉండి కూడా విరాట్ కొహ్లీ క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని…ఆటగాళ్ల కోసం ఐసీసీ నిర్దేశించిన నియమావళిని… భారత కెప్టెన్ అతిక్రమించిన నేరంపైన… ఓ డీ మెరిట్ పాయింట్ ఇస్తూ…హెచ్చరిక జారీ చేశారు.

మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్స్ సన్, ఫీల్డ్ అంపైర్లు నితిన్ మేనన్, నందన్, థర్డ్ అంపైర్ అనీల్ చౌదరి, ఫోర్త్ అంపైర్ షంషుద్దీన్.. కలసి ఓ నివేదిక తయారు చేయడం ద్వారా.. కొహ్లీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

కొహ్లీ సైతం తాను నిబంధనలను అతిక్రమించినట్లు ఒప్పుకోడం విశేషం. ఐసీసీ ప్లేయర్ల నియమావళిని అతిక్రమించడం కొహ్లీకి గత ఏడాదికాలంలో ఇది మూడోసారి.

2018 జనవరి 15న సౌతాఫ్రికాతో ప్రిటోరియా టెస్ట్ ఆడుతూ కొహ్లీ తొలి వార్నింగ్ అందుకొన్నాడు. ఆ తర్వాత 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో అప్ఘనిస్థాన్ పైన సైతం కొహ్లీ దుందుడుకుగా వ్యవహరించడం ద్వారా …ఐసీసీ నుంచి రెండో వార్నింగ్ అందుకొన్నాడు.

ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్ ప్రారంభంలోనే మూడో వార్నింగ్ తో పాటు డీమెరిట్ పాయింట్ సైతం కొహ్లీ ఖాతంలో చేరింది. కొహ్లీ మరోసారి ఇదే పొరపాటు చేస్తే మ్యాచ్ ఫీజులో సగం మొత్తం జరిమానాగా చెల్లించే ప్రమాదం లేకపోలేదు.

First Published:  24 Sep 2019 12:54 AM GMT
Next Story