Telugu Global
Cinema & Entertainment

అల వైకుంఠపురం ఓవర్సీస్ డీల్

బన్నీ-త్రివిక్రమ్ ది క్రేజీ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలు రెండూ హిట్ అయ్యాయి. ఈసారి ఇద్దరూ కలిసి అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తున్నారు. పైగా ఇది కాసులు కురిపించే సంక్రాంతి బరిలో నిలిచింది. దీంతో ఈ సినిమా హాట్ కేకులా మారింది. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ఏపీ, నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేశారు. కొన్ని ఏరియాలకు సంబంధించి అడ్వాన్స్ […]

అల వైకుంఠపురం ఓవర్సీస్ డీల్
X

బన్నీ-త్రివిక్రమ్ ది క్రేజీ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాలు రెండూ హిట్ అయ్యాయి. ఈసారి ఇద్దరూ కలిసి అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తున్నారు. పైగా ఇది కాసులు కురిపించే సంక్రాంతి బరిలో నిలిచింది. దీంతో ఈ సినిమా హాట్ కేకులా మారింది.

హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ఏపీ, నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేశారు. కొన్ని ఏరియాలకు సంబంధించి అడ్వాన్స్ లు అందుకున్నారు…. కానీ అగ్రిమెంట్లు చేసుకోలేదు. తాజాగా ఓవర్సీస్ కు సంబంధించి డీల్ లాక్ చేశారు. అటుఇటుగా 9 కోట్ల రూపాయలకు అల వైకుంఠపురములో ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయాయి.

త్రివిక్రమ్ కు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అటు బన్నీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమాకు మంచి రేటు పలికింది. కాకపోతే మేకర్స్ మాత్రం ఈ సినిమాకు దాదాపు 12 కోట్ల రూపాయలు ఆశించారు. కానీ అంత రేటుకు అమ్మితే బ్రేక్-ఈవెన్ కష్టమౌతుందని, పైగా అటుఇటు రిజల్ట్ తేడాకొడితే మొదటికే మోసం వస్తుందని భావించి 9 కోట్లకు ఫిక్స్ చేశారు. ఈ విషయంలో అల్లు అరవింద్ చాకచక్యంగా వ్యవహరించాడట.

ప్రస్తుతం కలెక్షన్ల ఆధారంగానే విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఎంత రికవరీ అయిందనే అంశంపైనే సక్సెస్ రేటు చెబుతున్నారు. కేవలం తక్కువ రేట్లకు అమ్మడం వల్లనే చిత్రలహరి, ఎవరు, బ్రోచేవారెవరురా, మజిలీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ఈజీగా బ్రేక్-ఈవెన్ అయ్యాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు బన్నీ సినిమాకు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలనుకుంటున్నారు.

First Published:  24 Sep 2019 8:01 PM GMT
Next Story