Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ తర్వాత.... హిట్ అందుకున్నాడు

మిగతా దర్శకులతో పోలిస్తే హరీష్ శంకర్ కెరీర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ లను మాత్రమే కాకుండా పెద్ద డిజాస్టర్ లను కూడా చవి చూశారు హరీష్ శంకర్. ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫ్లాప్ అనే పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ తాజాగా గద్దలకొండ గణేష్ సినిమా హిట్ అవడంతో హరీష్ శంకర్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దర్శకుల సరసన చేరిపోయాడు. మంచి కథలను […]

ఫ్లాప్ తర్వాత.... హిట్ అందుకున్నాడు
X

మిగతా దర్శకులతో పోలిస్తే హరీష్ శంకర్ కెరీర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బాస్టర్ లను మాత్రమే కాకుండా పెద్ద డిజాస్టర్ లను కూడా చవి చూశారు హరీష్ శంకర్.

ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ఫ్లాప్ అనే పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ తాజాగా గద్దలకొండ గణేష్ సినిమా హిట్ అవడంతో హరీష్ శంకర్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దర్శకుల సరసన చేరిపోయాడు. మంచి కథలను ఎంపిక చేసుకోవడం మాత్రమేకాక హరీష్ శంకర్ వాటిని తెరకెక్కించే విధానం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ముఖ్యంగా హరీష్ శంకర్ సినిమాలో పంచ్ డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను తన నెరేషన్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాడు హరీష్ శంకర్.

‘డిజె’ సినిమా ఫ్లాప్ తర్వాత చాలాకాలం కష్టపడిన హరీష్ శంకర్… ఎట్టకేలకు ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో హిట్ అందుకున్నారు. బి సి సెంటర్లలోనే కాకుండా ఏ సెంటర్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని రీచ్ కాబోతున్న ఈచిత్రం డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్ లు ఇస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

First Published:  24 Sep 2019 11:41 PM GMT
Next Story