Telugu Global
NEWS

తొలి టీ-20లో భారత మహిళల బోణీ

పోరాడి ఓడిన సౌతాఫ్రికా ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత మహిళాజట్టు తొలి విజయంతో బోణీ కొట్టింది. సూరత్ వేదికగా ముగిసిన తొలిమ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజేతగా నిలిచి 1-0 ఆధిక్యం సంపాదించింది. హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. […]

తొలి టీ-20లో భారత మహిళల బోణీ
X
  • పోరాడి ఓడిన సౌతాఫ్రికా

ప్రపంచకప్ కు సన్నాహకంగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో భారత మహిళాజట్టు తొలి విజయంతో బోణీ కొట్టింది.

సూరత్ వేదికగా ముగిసిన తొలిమ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజేతగా నిలిచి 1-0 ఆధిక్యం సంపాదించింది.

హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్…

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.

స్లోబౌలర్లు… ప్రధానంగా స్పిన్ బౌలర్లకు అనువుగా ఉన్న సూరత్ వికెట్ పై పరుగులు సాధించడానికి కష్టపడాల్సి వచ్చింది.

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 34 బాల్స్ లో 3 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్ 3, డీ క్లార్క్ 2 వికెట్లు పడగొట్టారు.

దీప్తి శర్మ స్పిన్ మ్యాజిక్…

131 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సఫారీ టీమ్…భారత స్పిన్ ట్రాప్ లో చిక్కుకొంది. ఒక దశలో 65 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీప్తి శర్మ 3 మేడిన్ ఓవర్లతో సహా 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.

అయితే…సౌతాఫ్రికా మిడిలార్డర్ ప్లేయర్ డ్యు ప్రీజ్ ఎదురుదాడితో చెలరేగిపోయింది. కేవలం 43 బాల్స్ లోనే 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 59 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించినా తనజట్టును విజేతగా నిలుపలేకపోయింది.

సఫారీటీమ్ 19.5 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్నర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని రెండో టీ-20 మ్యాచ్ సైతం సూరత్ వేదికగానే…ఈ నెల 29న జరుగుతుంది.

First Published:  25 Sep 2019 3:15 AM GMT
Next Story