Telugu Global
Cinema & Entertainment

యూట్యూబ్ లో మరొ రికార్డు సృష్టించిన సాయి పల్లవి

హీరోయిన్ కాక ముందే సాయి పల్లవి ఒక డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ అయిన తర్వాత కూడా నటన పరంగానే కాకుండా స్టార్ హీరోస్ తో సమానంగా డాన్స్ చేయడంలో దూసుకుపోతోంది. ‘ఫిదా’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సాయిపల్లవి…. నాని సరసన ‘ఎంసీఏ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె డాన్స్ చేసిన ‘ఏవండోయ్ నాని గారు’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. దేవి శ్రీ […]

యూట్యూబ్ లో మరొ రికార్డు సృష్టించిన సాయి పల్లవి
X

హీరోయిన్ కాక ముందే సాయి పల్లవి ఒక డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్ అయిన తర్వాత కూడా నటన పరంగానే కాకుండా స్టార్ హీరోస్ తో సమానంగా డాన్స్ చేయడంలో దూసుకుపోతోంది.

‘ఫిదా’ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న సాయిపల్లవి…. నాని సరసన ‘ఎంసీఏ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె డాన్స్ చేసిన ‘ఏవండోయ్ నాని గారు’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ పాట ని దివ్య కుమార్, శ్రావణ భార్గవి లు పాడారు. బాలాజీ లిరిక్స్ అందించిన ఈ పాట వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

అప్పట్లో ఈ పాట వల్లే సినిమాకి మరింత హైప్ వచ్చింది. తాజాగా యూట్యూబ్ లో ఈ వీడియో ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఇప్పటికే రౌడీ బేబీ సాంగ్ తో పాటు… ఈమె డాన్స్ చేసిన వీడియోలు చాలానే యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో చేరిపోయింది ‘ఏవండోయ్ నాని గారు’ పాట. ఈ పాటలో సాయి పల్లవి వేసిన స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాల పరంగానే కాకుండా యూట్యూబ్ లో కూడా సాయి పల్లవి బోలెడు రికార్డులు సృష్టిస్తోంది.

First Published:  25 Sep 2019 6:29 AM GMT
Next Story