Telugu Global
NEWS

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు వీరే...

దేశంలో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న ప్రముఖుల జాబితాలను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్ హురున్‌ ఇండియా సంస్థ విడుదల చేసింది. ముఖేష్ అంబానీ 3.8 లక్షల కోట్ల సంపదతో తొలిస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో పలువురు తెలుగు వ్యక్తులకు చోటు దక్కింది. తొలి వంద మంది సంపన్నుల జాబితాలో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. అరంబిందో ఫార్మా అధినేత పీవీ రాంప్రసాద్ రెడ్డి 14.8 వేల కోట్ల సంపదతో తెలుగువారిలో సంపన్నుడిగా ఉన్నారు. ఈయనకు దేశ సంపన్నుల […]

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు వీరే...
X

దేశంలో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న ప్రముఖుల జాబితాలను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్ హురున్‌ ఇండియా సంస్థ విడుదల చేసింది. ముఖేష్ అంబానీ 3.8 లక్షల కోట్ల సంపదతో తొలిస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో పలువురు తెలుగు వ్యక్తులకు చోటు దక్కింది. తొలి వంద మంది సంపన్నుల జాబితాలో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. అరంబిందో ఫార్మా అధినేత పీవీ రాంప్రసాద్ రెడ్డి 14.8 వేల కోట్ల సంపదతో తెలుగువారిలో సంపన్నుడిగా ఉన్నారు. ఈయనకు దేశ సంపన్నుల జాబితాలో 51 వ స్థానం దక్కింది.

తెలుగు రాష్ట్రాల నుంచి రెండో అతిపెద్ద సంపన్నుడిగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ పిపి రెడ్డి ఉన్నారు. ఈయన సంపద 13.4 వేల కోట్లు. దేశంలోని సంపన్నుల జాబితాలో పీపీ రెడ్డి 57వ స్థానంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సంపన్నుల జాబితాలో మూడో స్థానాన్ని కూడా మేఘా కుటుంబమే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మూడో సంపన్న వ్యక్తిగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి(12వేల 900 కోట్లు) నిలిచారు. దేశ సంపన్నుల జాబితాలో పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో దివీస్ ల్యాబ్స్‌ అధినేత దివి సత్చంద్ర కిరణ్ 10.2 వేల కోట్ల సంపదతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో స్థానం సొంతం చేసుకున్నారు.

ఐఐఎఫ్‌ఎల్‌ హురున్ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగువారిలో డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్స్‌కు చెందిన జీవీ ప్రసాద్‌ (5,900కోట్లు), ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ అధినేత ఎం సత్యనారాయణరెడ్డి (5,600 కోట్లు), హెటెరో డ్రగ్స్ అధినేత బి. పార్థసారథిరెడ్డి (5,200 కోట్లు), నాట్కో ఫార్మా వీసీ నన్నపనేని(5,200 కోట్లు), మైహోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు(4,500 కోట్లు), అమరరాజా బ్యాటరీస్ రామచంద్ర గల్లా(3,400 కోట్లు), గంగవరం పోర్ట్ డీవీఎస్‌ రాజు ( 3,000కోట్లు), నూజీవీడు సీడ్స్ ఎన్‌ ప్రభాకర్ రావు (3000 కోట్లు), పెన్నా సిమెంట్స్‌ పెన్నా ప్రతాప్ రెడ్డి (3వేల కోట్ల) ఉన్నారు.

First Published:  25 Sep 2019 8:50 PM GMT
Next Story