Telugu Global
Cinema & Entertainment

గద్దలకొండ గణేష్ ని ఇలా వాడుకుంటున్నాడు !

‘అంజలి సీబీఐ’ సినిమాలో నయనతార తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ నటుడు అథర్వ మురళి ఈ మధ్యనే వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులో అడుగు పెట్టేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం అథర్వ మురళి ఇప్పుడు మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అథర్వ మురళి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ […]

గద్దలకొండ గణేష్ ని ఇలా వాడుకుంటున్నాడు !
X

‘అంజలి సీబీఐ’ సినిమాలో నయనతార తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ నటుడు అథర్వ మురళి ఈ మధ్యనే వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో డైరెక్ట్ గా తెలుగులో అడుగు పెట్టేశాడు.

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజా సమాచారం ప్రకారం అథర్వ మురళి ఇప్పుడు మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అథర్వ మురళి హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బూమరాంగ్’ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అవుతోంది.

మేఘ ఆకాష్, ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి ఆర్ కణ్ణన్ దర్శకత్వం వహించాడు. విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సి హెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, అలాగే ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే విధంగా చక్కని స్క్రీన్ ప్లే ఉంటుందని అన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘హుషారు’ ఫేమ్ రధన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

First Published:  26 Sep 2019 1:40 AM GMT
Next Story