Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ సరసన మిల్కీబ్యూటీ

ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు తన క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉండే కథల్ని ఎంచుకుంటుంది తమన్న. ఈ క్రమంలో హీరో ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గోపీచంద్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడానికి కారణం ఇదే. సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తమన్న పాత్ర చాలా కీలకం. హీరో తర్వాత హైలెట్ క్యారెక్టర్ ఆమెదే. అందుకే ఈ సినిమాలో నటించేందుకు […]

గోపీచంద్ సరసన మిల్కీబ్యూటీ
X

ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు తన క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉండే కథల్ని ఎంచుకుంటుంది తమన్న. ఈ క్రమంలో హీరో ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గోపీచంద్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడానికి కారణం ఇదే.

సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తమన్న పాత్ర చాలా కీలకం. హీరో తర్వాత హైలెట్ క్యారెక్టర్ ఆమెదే. అందుకే ఈ సినిమాలో నటించేందుకు తమ్ము ఒప్పుకుంది. ఇక్కడే మరో రీజన్ కూడా ఉంది.

డైరక్టర్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది తమన్న. అందుకే ఆమెతో ఒకసారి సినిమా చేసిన దర్శకులు మరోసారి రిపీట్ చేయాలని చూస్తారు. సంపత్ నంది కూడా అదే చేశాడు. రచ్చ సినిమాతో ఫస్ట్ టైమ్ కలిశారు తమన్న-నంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బెంగాల్ టైగర్ సినిమా చేశారు.

ఇలా రెండు సార్లు కనెక్ట్ అయ్యారు కాబట్టే తన గోపీచంద్ తో చేయబోతున్న సినిమాకు కూడా తమన్నానే రిపీట్ చేయాలని భావించాడు సంపత్ నంది. ఈ సినిమాలో తమన్నకు ఛాన్స్ దక్కడానికి ఇది కూడా ఓ కారణం.

ప్రస్తుతం సైరా ప్రమోషన్ లో బిజీగా ఉంది తమన్న. దీంతో పాటు తమిళ్ లో ఆమె చేస్తున్న ఓ సినిమా షూటింగ్ కొలిక్కి రానుంది. ఈ రెండు వ్యవహారాలు పూర్తయిన వెంటనే గోపీచంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తుంది ఈ బ్యూటీ.

First Published:  25 Sep 2019 9:15 PM GMT
Next Story