ఇవాళ్టి నుంచి మీ థియేటర్లలో నా బొమ్మ

పూరి జగన్నాధ్, చార్మి మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. రీసెంట్ గా వచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. డిసైడ్ చేయడం మాత్రమే కాదు, వెంటనే దాన్ని అమలుపరిచారు కూడా. అవును.. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా మరోసారి హంగామా చేయబోతోంది.

ఏపీ, నైజాంలోకి కొన్ని కీలకమైన సెంటర్లలో ఈ సినిమాను రీ-రిలీజ్ చేయాలని పూరి-చార్మి నిర్ణయించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఓ వీడియో పెట్టింది చార్మి. ఇవాళ్టి నుంచి మీ థియేటర్లలో నా బొమ్మ అంటూ, లిస్ట్ కూడా ప్రకటించింది. నైజాంలో వరంగల్, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, హైదరాబాద్ లోని చెరో థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ ఇవాళ్టి నుంచి హంగామా చేయబోతోంది. అటు ఏపీలో రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, గుంటూరు, విశాఖఫట్నంలోని చెరో థియేటర్ లో సినిమా రీ-రిలీజ్ అవుతుంది.

పూరి-చార్మి తీసుకున్న తాజా నిర్ణయంతో గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేశ్ సినిమాలు డైలమాలో పడ్డాయి. ఇప్పటికే 70శాతం రికవరీ అయిందని చెప్పుకుంటున్నారు గద్దలకొండ గణేశ్ నిర్మాతలు. కానీ రికవరీ అయింది మాత్రం 50శాతం మాత్రమే. ఈ వీకెండ్ పై వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అటు గ్యాంగ్ లీడర్ ఇప్పటికే కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వగా, ఈ వీకెండ్ వచ్చే వసూళ్లతో కొంత మేరకు అయినా గట్టెక్కాలని అది భావిస్తోంది. ఈ రెండు సినిమాల ఆశల్ని ఇస్మార్ట్ గల్లంతు చేయబోతున్నాడు. వచ్చేది తక్కువ థియేటర్లలోనే అయినప్పటికీ, కీలకమైన సెంటర్లు కావడంతో వరుణ్ తేజ్, నాని సినిమాలకు రామ్ సినిమా పోటీగా మారింది