Telugu Global
International

25 మంది వద్దే 10 శాతం దేశ సంపద... ముఖేష్‌ మొదటిస్థానం

దేశంలో మరోసారి అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ తొలిస్థానంలో నిలిచారు. ప్రస్తుతం దేశంలోని 10 శాతం సంపద కేవలం 25 మంది బడాబాబుల వద్దే ఉంది. 2019నాటికి దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎల్‌ వెల్త్ హురున్‌ సంస్థ విడుదల చేసింది. కనీసం 1000 కోట్ల సంపద ఉన్న వారితో ఈ జాబితాను రూపొందించింది. గతేడాదితో పోలిస్తే ఈ నివేదికలో చోటు సంపాదించుకున్న వారి సంఖ్య 181 శాతం పెరిగింది. ఇలా అత్యధిక సంపదను పోగేసుకున్న వారి […]

25 మంది వద్దే 10 శాతం దేశ సంపద... ముఖేష్‌ మొదటిస్థానం
X

దేశంలో మరోసారి అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ తొలిస్థానంలో నిలిచారు. ప్రస్తుతం దేశంలోని 10 శాతం సంపద కేవలం 25 మంది బడాబాబుల వద్దే ఉంది. 2019నాటికి దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ఐఐఎఫ్ఎల్‌ వెల్త్ హురున్‌ సంస్థ విడుదల చేసింది. కనీసం 1000 కోట్ల సంపద ఉన్న వారితో ఈ జాబితాను రూపొందించింది. గతేడాదితో పోలిస్తే ఈ నివేదికలో చోటు సంపాదించుకున్న వారి సంఖ్య 181 శాతం పెరిగింది.

ఇలా అత్యధిక సంపదను పోగేసుకున్న వారి జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. 3.8లక్షల కోట్ల సంపద ముఖేష్ వద్ద ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే ముఖేష్‌ 8వ అత్యంత ధనికుడిగా ఉన్నారు. ముఖేష్ తర్వాత ఎస్పీ హిందూజ అండ్ ఫ్యామిలీ 1.5 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో 1.2 లక్షల కోట్లతో విప్రో వ్యవస్థాపకుడు ప్రేమ్ జీ , నాలుగో స్థానంలో సైరస్ పోనవల్ల( 89.9వేల కోట్లు), లక్ష్మీ మిట్టల్ ఐదో స్థానం(87.9 వేల కోట్లు), ఉదయ్‌ కొటాక్ ఆరో స్థానం( 75.6 వేల కోట్లు), గౌతమ్ ఆదానీ ఏడో స్థానం( 70.6వేల కోట్లు)లో ఉన్నారు.

దేశంలో ముంబాయి నుంచి అత్యధిక మంది బిలీనియర్స్ ఉన్నారు. ముంబాయి నుంచి 42 మందికి చోటు దక్కగా… ఆ తర్వాత ఢిల్లీ నుంచి 25 మందికి చోటు దక్కింది. అత్యధిక బిలీనియర్లు ఉన్న జాబితాలో బెంగళూరు మూడో స్థానంలో, హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచాయి.

First Published:  25 Sep 2019 7:38 PM GMT
Next Story