Telugu Global
NEWS

పీటీ ఉషకు అరుదైన గౌరవం

పరుగుల రాణికి వెటరన్ పిన్ అవార్డు భారత ఆల్ టైమ్ గ్రేట్ రన్నర్, అలనాటి పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది.1980 దశకంలో భారత అథ్లెటిక్స్ కే మరోపేరుగా నిలవడంతో పాటు.. 100కు పైగా అంతర్జాతీయ పతకాలు సాధించడమే కాదు…లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పరుగులో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకోడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉష గుర్తింపు తెచ్చుకొంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఉష సాధించిన అరుదైన విజయాలు, క్రీడారంగానికి […]

పీటీ ఉషకు అరుదైన గౌరవం
X
  • పరుగుల రాణికి వెటరన్ పిన్ అవార్డు

భారత ఆల్ టైమ్ గ్రేట్ రన్నర్, అలనాటి పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది.1980 దశకంలో భారత అథ్లెటిక్స్ కే మరోపేరుగా నిలవడంతో పాటు.. 100కు పైగా అంతర్జాతీయ పతకాలు సాధించడమే కాదు…లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పరుగులో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకోడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉష గుర్తింపు తెచ్చుకొంది.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఉష సాధించిన అరుదైన విజయాలు, క్రీడారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య..అత్యంత అరుదైన వెటరన్ పిన్ అవార్డును ఇచ్చి సత్కరించింది.

దోహాలో జరిగిన 2019 ఐఏఏఎఫ్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా..చైనా,జపాన్ వెటరన్ అథ్లెట్లతో పాటు పీటీ ఉషకు సైతం…అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో పురస్కారాన్ని అందచేశారు.

పయ్యోలీ ఎక్స్ ప్రెస్ గా పేరుపొందిన పీటీ ఉష 1983లో అర్జున, 1985లో పద్మశ్రీ పురస్కారాలు అందుకోడం ద్వారా భారత మహిళా అథ్లెట్ల ఖ్యాతిని పెంచారు.

First Published:  25 Sep 2019 11:40 PM GMT
Next Story