Telugu Global
NEWS

సింధు కథ మళ్లీ మొదటికి...

కోచ్ లేకపోడంతో వరుస పరాజయాలు తెలుగుతేజం, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కథ మళ్లీ మొదటి కొచ్చింది. ప్రపంచ టైటిల్ సాధించిన ఆనందం మూడురోజుల ముచ్చటగా ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచ టైటిల్ విజయం తర్వాత జరిగిన చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోర్నీల ప్రారంభ రౌండ్లలోనే సింధు పరాజయాలు పొందడం ఆందోళన కలిగిస్తోంది. విశ్వవిజేతగా నిలిచిన సింధు… చైనా, కొరియన్ ఓపెన్ లాంటి టో్ర్నీలలో… అదీ అంతగా పేరులేని చోటామోటా ప్లేయర్ల చేతిలో ఓటమి పొందటం ఆందోళన రేకెత్తిస్తోంది. […]

సింధు కథ మళ్లీ మొదటికి...
X
  • కోచ్ లేకపోడంతో వరుస పరాజయాలు

తెలుగుతేజం, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కథ మళ్లీ మొదటి కొచ్చింది. ప్రపంచ టైటిల్ సాధించిన ఆనందం మూడురోజుల ముచ్చటగా ముగిసిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రపంచ టైటిల్ విజయం తర్వాత జరిగిన చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోర్నీల ప్రారంభ రౌండ్లలోనే సింధు పరాజయాలు పొందడం ఆందోళన కలిగిస్తోంది.

విశ్వవిజేతగా నిలిచిన సింధు… చైనా, కొరియన్ ఓపెన్ లాంటి టో్ర్నీలలో… అదీ అంతగా పేరులేని చోటామోటా ప్లేయర్ల చేతిలో ఓటమి పొందటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్న సింధు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయింది.

అంతా.. కొరియా కోచ్ మహిమేనా..?

గత పదిరోజుల్లో సింధు రెండు టోర్నీల ప్రారంభరౌండ్లలోనే ఓటమి పొందటానికి అసలు కారణమేంటో బయటకు వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జీ హ్యూన్ వ్యక్తిగత కోచ్ గా సింధు గత కొద్దిమాసాలుగా శిక్షణ పొందుతూ వస్తోంది.

కిమ్ నేతృత్వంలో సింధు తన ఫిట్ నెస్ ను మెరుగుపరచుకోడమే కాదు… మూడు గేమ్ ల హోరాహోరీ సమరంలో ఎలా నెగ్గుకురావాలో తెలుసుకోగలిగింది. తన ఆటతీరులోని లోపాలను కిమ్ సాయంతో చాలావరకూ సవరించుకోగలిగింది.

కిమ్ జీ శిక్షణ కారణంగానే…బాసెల్ లో ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను సింధు నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించింది.

టైటిల్ విజయం తర్వాత…తన వ్యక్తిగత కోచ్ కిమ్, భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ లతో కలసి ప్రధాని నరేంద్ర మోడీని సైతం సింధు కలసి వచ్చింది.

వ్యక్తిగత కారణాలతో కిమ్ రాజీనామా….

సింధు వ్యక్తిగత కోచ్ పదవికి కిమ్ హఠాత్తుగా రాజీనామా చేసింది. న్యూజిలాండ్ లో నివాసం ఉంటున్న తన భర్త రిచీ మార్ట్ కు స్ట్ర్రోక్ రావడంతో… ఆయన్ని దగ్గరుండి చూసుకోడానికి కిమ్ తిరిగివెళ్లిపోయింది.

దీంతో…పీవీ సింధు కథ మళ్లీ మొదటికి వచ్చింది. వ్యక్తిగత కోచ్ గా కిమ్ సలహాలు,సూచనలు లేకపోడంతో…సింధు ఆటతీరు నిస్తేజంగా మారిపోయింది.

పాత బలహీనతలు మరోసారి బయటకు రావడంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోర్నీలలో పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

కిమ్ జీ హ్యూన్ ఆరుమాసాలపాటు తన భర్త దగ్గరే ఉంటుందని..ఆమె అందుబాటులోకి రావడం కష్టమేనని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పాడు.

మరోవైపు…కిమ్ లేకుండా టోర్నీలలో పాల్గొనటం సింధుకు ఇబ్బందిగానే ఉందని…ఆమె తండ్రి రమణ అంటున్నారు.

ఏది ఏమైనా ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా…కిమ్ భర్తకు వచ్చిన స్ట్రోక్ కాస్త…సింధు పరాజయాలకు కారణం కావడం చిత్రం కాక మరేమిటి.

First Published:  26 Sep 2019 8:53 AM GMT
Next Story