Telugu Global
National

జైలులో వి.ఐ.పి గదులు.... 8 లక్షలు అద్దె

డబ్బులున్నవారు ఎక్కడ ఉన్నా రాజభోగం అనుభవించే అవకాశం ఉందనే సంగతిని మరోసారి నిరూపించే ఉదాహరణ రాజస్థాన్ లో బయట పడింది. యాంటి కరప్షన్ బ్యూరో ఇటీవల జరిపిన దర్యాప్తులో రాజస్థాన్ అజ్మీర్ జైలులో… అన్ని సౌకర్యాలు ఉన్న గదిని ఇచ్చినందుకు అధికార్లకు కొందరు ఖైదీలు అద్దె చెల్లిస్తున్నారని తేలింది. ఒక దోషిని జైలుకు పంపినప్పుడు, అతను చేసిన నేరానికి శిక్షగా అతని జైలు జీవితం ఉండాలని కోర్టులు భావిస్తాయి. ఆ శిక్ష నేరస్థులలో పరివర్తన కలిగించాలని భావిస్తాయి. […]

జైలులో వి.ఐ.పి గదులు.... 8 లక్షలు అద్దె
X

డబ్బులున్నవారు ఎక్కడ ఉన్నా రాజభోగం అనుభవించే అవకాశం ఉందనే సంగతిని మరోసారి నిరూపించే ఉదాహరణ రాజస్థాన్ లో బయట పడింది. యాంటి కరప్షన్ బ్యూరో ఇటీవల జరిపిన దర్యాప్తులో రాజస్థాన్ అజ్మీర్ జైలులో… అన్ని సౌకర్యాలు ఉన్న గదిని ఇచ్చినందుకు అధికార్లకు కొందరు ఖైదీలు అద్దె చెల్లిస్తున్నారని తేలింది.

ఒక దోషిని జైలుకు పంపినప్పుడు, అతను చేసిన నేరానికి శిక్షగా అతని జైలు జీవితం ఉండాలని కోర్టులు భావిస్తాయి. ఆ శిక్ష నేరస్థులలో పరివర్తన కలిగించాలని భావిస్తాయి. కాని ఇక్కడ జైలు ఒక పిక్నిక్ స్పాట్ లా మారడమే విషాదం. ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడం కాక మరేమిటి?

ఓ ఇంగ్లీషు దినపత్రిక రిపోర్ట్ ప్రకారం… అజ్మీర్ సెంట్రల్ జైలులోని ప్రతి బ్యారక్‌లోను ఒక గదిలో ఖైదీలకు “విఐపి సౌకర్యాలు” కల్పించారు అధికారులు.

“దర్యాప్తులో బారక్ నంబర్ 1 నుండి బారక్ నంబర్ 15 వరకు అన్ని బారక్ ల లో మంచి ఆర్థిక నేపథ్యం నుండి వచ్చిన ఖైదీలకు విఐపి గది ఉందని మేం గుర్తించాం. ఈ గదులపై చాక్ పీస్ లతో మార్కింగ్ చేశారు. ఈ ఖైదీలకు శుభ్రమైన గది, ప్రత్యేక ఆహారం, శుభ్రమైన బట్టలు వంటి వివిధ సౌకర్యాలు కల్పించారు” అని విచారణాధికారి పేర్కొన్నారు. ఈ విఐపి గదుల కోసం ఖైదీలు ప్రతి నెలా రూ.8 లక్షలు అద్దె చెల్లిస్తున్నారని ఆ అధికారి తెలిపారు.

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యుల నుండి డబ్బు వసూలు చేయడానికి మధ్యవర్తులు ఉన్నారని, చాలా డబ్బు జైలు వెలుపల చేతులు మారిందని కనుగొన్నారు. కొందరు నగదు రూపంలో చెల్లించగా, మరికొందరు డబ్బును ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశారని విచారణలో బయటపడింది.

పొగాకు, సిగరెట్లు వంటివి జైలులో నిషిద్ధం. అయినా వాటిని సరఫరా చేసినందుకు కూడా డబ్బు చెల్లించారని విచారణలో గుర్తించారు. పొగాకుకి రూ.300-500 మధ్య, సిగరెట్లకి రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య అధికార్లకు ఖైదీలు చెల్లించారట.

ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 12 మందిపై అభియోగాలు మోపారు. వారిలో నలుగురు జైలు ఉద్యోగులతో పాటు ఖైదీలు, వారి బంధువులు ఉన్నారు. మాజీ జైలర్, ముగ్గురు మధ్యవర్తులను అరెస్టు కూడా చేశారు.

First Published:  26 Sep 2019 8:55 AM GMT
Next Story