Telugu Global
Cinema & Entertainment

ఇదే సైరా యుద్ధ భూమి...

సైరా ప్రమోషన్ మొత్తం సినిమాలో యుద్ధ సన్నివేశాల చుట్టూనే తిరుగుతోంది. జార్జియాలో తీసిన కొన్ని యుద్ధ సన్నివేశాల కోసం భారీగా ఖర్చయిందని మేకర్స్ పదేపదే చెబుతున్నారు. కేవలం 30 రోజుల షెడ్యూల్ కు అక్షరాలా 70 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ఇప్పుడా ఖర్చును మరోసారి చూపించే ప్రయత్నం చేశారు. సైరా సినిమాకు సంబంధించి సెకెండ్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. మొదటి ట్రయిలర్ లో పాత్రల పరిచయం ఉంది. నటీనటుల డైలాగ్స్ కూడా ఉన్నాయి. కానీ రెండో ట్రయిలర్ […]

ఇదే సైరా యుద్ధ భూమి...
X

సైరా ప్రమోషన్ మొత్తం సినిమాలో యుద్ధ సన్నివేశాల చుట్టూనే తిరుగుతోంది. జార్జియాలో తీసిన కొన్ని యుద్ధ సన్నివేశాల కోసం భారీగా ఖర్చయిందని మేకర్స్ పదేపదే చెబుతున్నారు. కేవలం 30 రోజుల షెడ్యూల్ కు అక్షరాలా 70 కోట్లు ఖర్చయినట్టు తెలిపారు. ఇప్పుడా ఖర్చును మరోసారి చూపించే ప్రయత్నం చేశారు. సైరా సినిమాకు సంబంధించి సెకెండ్ ట్రయిలర్ రిలీజ్ చేశారు.

మొదటి ట్రయిలర్ లో పాత్రల పరిచయం ఉంది. నటీనటుల డైలాగ్స్ కూడా ఉన్నాయి. కానీ రెండో ట్రయిలర్ ను మాత్రం పూర్తిగా యుద్ధ సన్నివేశాల్ని ఎలివేట్ చేసేలా కట్ చేశారు. చిరంజీవి, బిగ్ బి డైలాగ్స్ ఉన్నప్పటికీ యుద్ధాలు, గ్రాఫిక్స్, గ్రాండియర్ లుక్ మాత్రమే ఈ సెకెండ్ ట్రయిలర్ లో హైలెట్స్.

సైరా క్లయిమాక్స్ పై చాలా హోప్స్ పెట్టుకుంది యూనిట్. అందుకే క్లైమాక్స్ కు చెందిన సన్నివేశాల్నే ఎక్కువగా ట్రయిలర్ లో చూపించారు. రెండో ట్రయిలర్ కు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. తాజా ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

నిజానికి ఈ ట్రయిలర్ ను హిందీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కట్ చేశారు. అందుకే అమితాబ్ డైలాగ్ ఉంచారు. కానీ ఎప్పట్లానే అన్ని భాషల్లో విడుదల చేశారు. ఇది ఉత్తరాది జనాల్ని ఏ మేరకు ఆకర్షిస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. తెలుగులో మాత్రం మరింత బజ్ పెంచింది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్నాడు సైరా నరసింహారెడ్డి.

First Published:  26 Sep 2019 2:08 AM GMT
Next Story