Telugu Global
Cinema & Entertainment

ఈ వీకెండ్ మరింత చప్పగా!

సాహో సినిమా హవా ముగిసింది. గ్యాంగ్ లీడర్ సినిమా థియేటర్లలో ఉందంటే ఉందంతే. రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా కాస్త హంగామా చేస్తోంది తప్ప నిన్నట్నుంచి ఈ సినిమాకు కూడా ఆక్యుపెన్సీ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో బాక్సాఫీస్ ను మరింత చప్పగా చేయడానికి రెడీ అయ్యాయి 5 సినిమాలు. ఈ శుక్రవారం 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇంకా చెప్పాలంటే అందరూ కొత్తగా పరిచయమౌతున్న […]

ఈ వీకెండ్ మరింత చప్పగా!
X

సాహో సినిమా హవా ముగిసింది. గ్యాంగ్ లీడర్ సినిమా థియేటర్లలో ఉందంటే ఉందంతే. రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా కాస్త హంగామా చేస్తోంది తప్ప నిన్నట్నుంచి ఈ సినిమాకు కూడా ఆక్యుపెన్సీ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో బాక్సాఫీస్ ను మరింత చప్పగా చేయడానికి రెడీ అయ్యాయి 5 సినిమాలు.

ఈ శుక్రవారం 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు. ఇంకా చెప్పాలంటే అందరూ కొత్తగా పరిచయమౌతున్న దర్శకులు, హీరోహీరోయిన్లే. కనీసం ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మంచోళ్లు లేరంటే, ఈ వీకెండ్ సినిమాల పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.

రామ చక్కని సీత, నిన్ను తలచి, రాయలసీమ లవ్ స్టోరీ, మిర్రర్, బీజే సినిమాలు ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. బీజే లాంటి సినిమాకు ఇంటర్నెట్ లో పోస్టర్లు కూడా దొరకలేదు. ఇలాంటి సినిమాలన్నీ కలిసి ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏదైనా సినిమా క్లిక్ అవుతుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ అనవసరం.

First Published:  25 Sep 2019 11:00 PM GMT
Next Story