Telugu Global
Cinema & Entertainment

'డ్రీమ్ గర్ల్' గా మారబోతున్న.... రాజ్ తరుణ్

బాలీవుడ్ లో సరికొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడంలో ముందుంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఇప్పటికే ‘అంధాదున్’, ‘బదాయి హో’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేసిన ఆయుష్మాన్ తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఒక క్రాస్ జెండర్ సినిమా. ఆయుష్మాన్ ఖురానా అమ్మాయి గొంతు తో మాట్లాడుతూ ఒక కాల్ సెంటర్ లో […]

డ్రీమ్ గర్ల్ గా మారబోతున్న.... రాజ్ తరుణ్
X

బాలీవుడ్ లో సరికొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడంలో ముందుంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఇప్పటికే ‘అంధాదున్’, ‘బదాయి హో’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేసిన ఆయుష్మాన్ తాజాగా ‘డ్రీమ్ గర్ల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది ఒక క్రాస్ జెండర్ సినిమా. ఆయుష్మాన్ ఖురానా అమ్మాయి గొంతు తో మాట్లాడుతూ ఒక కాల్ సెంటర్ లో పని చేస్తాడు. సినిమా అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేశారట. హిందీ వెర్షన్ చూసిన తర్వాత ఈ సినిమాకి తెలుగు రీమేక్ లో రాజ్ తరుణ్ ఐతే బాగా సూట్ అవుతాడని…. అతనిని సంప్రదించడంతో ఒప్పుకున్నాడట.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. తెలుగు నేటివిటీకి సూటయ్యే లాగా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నట్లు సమాచారం. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  27 Sep 2019 4:08 AM GMT
Next Story