అండర్ కవర్ రా ఏజెంటుగా గోపీచంద్

గోపిచంద్ కెరీర్ లోని 25 వ సినిమా ‘పంతం’ కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ప్రస్తుతం గోపీచంద్ ‘చాణక్య’ అనే ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మెహరీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహిస్తున్నారు.

టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది…. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ధియోట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ బ్యాంక్ ఎంప్లాయ్ గా పనిచేసే ఒక అండర్ కవర్ రా ఏజెంట్ అని తెలుస్తోంది.

అయితే కొన్ని తప్పుడు ఆరోపణల వల్ల ఉద్యోగం కోల్పోయిన గోపీచంద్…. మళ్లీ ఎలా తన స్థానాన్ని పొందాడు మరియు దేశాన్ని టెర్రరిస్టుల నుంచి కాపాడాడు? అనేది సినిమా కథ అని అంటున్నారు.

ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే గోపీచంద్ ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘గూఢాచారి’ ఫేమ్ శ్రీ చరణ్ పాకల ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలకు సిద్దమవుతోంది.

Here You Go.. Our Spy Thriller #Chanakya's Trailer!!#Mehreenpirzada #ZareenKhan #Vetrivisuals #Thiru #AnilSunkara…

Posted by Gopichand on Thursday, 26 September 2019