Telugu Global
National

ఒక హిందూ దేవాలయానికి 500 ఏళ్ళుగా సేవలు చేస్తున్న ముస్లిం కుటుంబం

అస్సాంలో మోతీబార్ రెహ్మాన్ ఒక ముస్లిం ఐనా… హిందు దేవాలయాన్ని భక్తిశ్రద్ధలతో కాపాడుతున్నాడు. ఇది వాళ్ల కుటుంబం వందల ఏళ్ల నుంచి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. మనదేశ మత సామరస్యానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది. రెహమాన్ తన పూర్వీకుల మాదిరిగానే, ప్రతి ఉదయం బుర్హా గోసైర్ దన్ అనే శైవ ఆలయాన్ని శుభ్రం చేసి, శివుడికి కొవ్వొత్తులను వెలిగిస్తాడు. “నాకు ముందు, నా తండ్రి, ఆయనకు ముందు ఆయన తండ్రి… ఇట్లా గత 500 సంవత్సరాలుగా […]

ఒక హిందూ దేవాలయానికి 500 ఏళ్ళుగా సేవలు చేస్తున్న ముస్లిం కుటుంబం
X

అస్సాంలో మోతీబార్ రెహ్మాన్ ఒక ముస్లిం ఐనా… హిందు దేవాలయాన్ని భక్తిశ్రద్ధలతో కాపాడుతున్నాడు. ఇది వాళ్ల కుటుంబం వందల ఏళ్ల నుంచి కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. మనదేశ మత సామరస్యానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది.

రెహమాన్ తన పూర్వీకుల మాదిరిగానే, ప్రతి ఉదయం బుర్హా గోసైర్ దన్ అనే శైవ ఆలయాన్ని శుభ్రం చేసి, శివుడికి కొవ్వొత్తులను వెలిగిస్తాడు.

“నాకు ముందు, నా తండ్రి, ఆయనకు ముందు ఆయన తండ్రి… ఇట్లా గత 500 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ పవిత్ర స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామ”ని 73 ఏళ్ల రెహమాన్ చెప్పారు.

ఇలా ఈ శివాలయానికి వీళ్లు రక్షకులు ఎలా అయ్యారో వివరిస్తూ తమ పూర్వీకులు తనకు చేప్పిన సంగతిని రెహమాన్ చెప్పుకొచ్చాడు.

“మా కుటుంబంలో మొదటి వ్యక్తి బోర్హన్సా. శివుడు బోర్హన్సా వద్దకు వచ్చి, ‘నేను ఈ ప్రదేశంలో నివసించాలనుకుంటున్నాను. ఇకనుండి ఈ స్థలాన్ని కాపాడటం మీ కుటుంబ బాధ్యత. నేను మీ సేవను మాత్రమే అంగీకరిస్తాను. మరెవరూ ఈ సేవ చేయకూడదన్నాడట” అని రెహమాన్ వివరించారు.

“హిందువులే కాకుండా, చాలా మంది ముస్లిం ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడికి వచ్చే హిందువులు, ముస్లింలు తమ కోరికలు తరచూ నెరవేరుతాయని చెప్పార”ని ఆయన అన్నారు.

33 మిలియన్ల జనం నివసిస్తున్న అస్సాం లో పౌరుల రిజిస్టర్ (ఎన్ ఆర్ సి)వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ముస్లింల పేర్లు చాలా గల్లంతయ్యాయి. ఈ సంగతిని ప్రస్తావిస్తే…తన పేరును పౌరుల రిజిస్టర్‌లో చేర్చారని రెహమాన్ చెప్పారు.

First Published:  27 Sep 2019 6:37 AM GMT
Next Story