నాగచైతన్య…. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా?

కొన్నాళ్లపాటు ప్లాప్ సినిమాలతో సతమతమైన నాగ చైతన్య ఈ మధ్యనే ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

అయితే నాగార్జున హీరోగా నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమాల్లో కూడా నాగచైతన్య ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వినిపించాయి.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కి ప్రీక్వల్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య కి స్క్రిప్ట్ నెరేట్ చేశాడట. కానీ కథ అంతగా నచ్చకపోవడంతో నాగచైతన్య తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా సినిమా నుండి తప్పుకున్నాడా లేక స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడా… అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నాగచైతన్య చేయను అంటే ఆ పాత్ర ఎవరికి దక్కుతుందో తెలియాల్సి ఉంది.