అల్లుఅర్జున్…. ‘సామజవరగమన’

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ‘అల వైకుంఠపురం లో’. ‘డీజే’ సినిమాలో బన్నీ తో రొమాన్స్ చేసిన పూజా హెగ్డే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కి సంబందించిన మోషన్ పోస్టర్ లు అందరి దృష్టిని ఆకట్టుకోగా తాజాగా సినిమా నుండి ‘సామజ వరగమన’ అని సాగే మొదటి పాట లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

సినిమాకి సంగీతం అందించిన ఎస్ ఎస్ థమన్ ఈ పాటకి చక్కని ట్యూన్స్ ని అందించాడు. మెలోడియోస్ గా సాగిపోయే ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలవనుంది. సీతా రామశాస్త్రి అందించిన లిరిక్స్ ప్రభావితం చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా సిడ్ శ్రీరామ్ గొంతు ఈ పాటకు బాగా హైలైట్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకాలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. టబు, నవదీప్, సుశాంత్ మరియు నివేదా పేతురాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.