Telugu Global
CRIME

జడ్జి పర్సు కొట్టేసిన థక్ థక్ గ్యాంగ్

థక్ థక్ గ్యాంగ్ మరోసారి ఢిల్లీ లో యాక్టివేట్ అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో అదనపు సెషన్స్ జడ్జి కారు నుండి ఒక పర్సు ను దొంగిలించి పరారవ్వడం తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఠా సభ్యులు మొదట న్యాయమూర్తి దృష్టి మళ్లించి… ఆపై ఆమె కారు కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆమె పర్సు తీసుకుని పారిపోయారు. అయితే తాము దొంగిలించిన పర్సు మామూలు మనిషిది కాదని ఈ ముఠాకి తెలియదు. […]

జడ్జి పర్సు కొట్టేసిన థక్ థక్ గ్యాంగ్
X

థక్ థక్ గ్యాంగ్ మరోసారి ఢిల్లీ లో యాక్టివేట్ అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో అదనపు సెషన్స్ జడ్జి కారు నుండి ఒక పర్సు ను దొంగిలించి పరారవ్వడం తో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ముఠా సభ్యులు మొదట న్యాయమూర్తి దృష్టి మళ్లించి… ఆపై ఆమె కారు కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఆమె పర్సు తీసుకుని పారిపోయారు.

అయితే తాము దొంగిలించిన పర్సు మామూలు మనిషిది కాదని ఈ ముఠాకి తెలియదు. జడ్జి గారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. ముఠాలోని కొంతమంది సభ్యులను అరెస్టు చేశారు.

“గురువారం, మేము మా టీం సభ్యులను సివిల్ దుస్తులలో మోహరించాం. అదే ప్రాంతంలో ముఠాలోని మరికొందరు సభ్యులు మళ్లీ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అరెస్టు చేశామ”ని పోలీసు వర్గాలు తెలిపాయి.

‘థక్ థక్’ ముఠా సభ్యులు మొదటగా కారు డ్రైవర్ వైపు ఉన్న కిటికీ అద్దాలపై థక్, థక్ అని శబ్దం వచ్చేలా తట్టడం ద్వారా దొంగతనానికి తెరలేపుతారు. ఇంతలో, ఇతర సభ్యుడు కారు తలుపు తెరవడమో లేదా కారు కిటికీ అద్దాన్ని పగలగొట్ట డమో చేసి వస్తువులను దొంగిలించి పారిపోతాడు.

వీరు ముఖ్యంగా వాహనాల్లో ఉన్నవారినే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. బహుశా కార్లలో తిరిగేవారి దగ్గర మనీ పర్సులు ‘బరువు ‘ ఎక్కువగా ఉంటాయనేది వారి ఆలోచన కాబోలు. చిటికెలో పని ముగించుకుని మాయమయ్యే ఈ గ్యాంగ్ ని ఢిల్లీ వాసులు ‘థక్ థక్ గ్యాంగ్’ అని వ్యవహరిస్తూ ఉంటారు.

First Published:  28 Sep 2019 12:30 AM GMT
Next Story