కృతజ్ఞతలు చెబుతున్న ‘సైరా’ దర్శకుడు

మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు రెండు ట్రైలర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తుంది.

ఈ సినిమాకి నేపధ్య సంగీతాన్ని అందించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు జూలియస్ ప్యాకియమ్ కి దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

“సైరా సినిమాకి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అతని ఫ్రెష్ నేపధ్య సంగీతం మన రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం మాత్రమే కాక… ఎమోషనల్ గా కూడా మారుస్తుంది” అంటూ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు సురేందర్ రెడ్డి.

మరోవైపు ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

A big hug and heartfelt thanks to this sweet man Julius Packiam for giving an incredible Background Music for #Syeraa….

Posted by Director Surender Reddy on Friday, 27 September 2019