Telugu Global
NEWS

కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం

గోదావరి నదిలో ఇటీవల కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం సమయంలో ఆ గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు సాహసోపేతంగా వ్యవహరించారు. కళ్ల ముందే బోటు మునిగిపోతుండడం గమనించిన గ్రామస్తులు పడవల సాయంతో తక్షణం అక్కడికి వెళ్లి పలువురిని కాపాడారు. ఆ సమయంలో కచ్చులూరు గ్రామస్తులు తక్షణం స్పందించి ఉండకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. గోదావరి సుడులు తిరుగుతోందని తెలిసినా సాటి మనుషులను కాపాడేందుకు 18 మంది గ్రామస్తులు తమ ప్రాణాలకు తెగించి నదిలోకి […]

కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం
X

గోదావరి నదిలో ఇటీవల కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం సమయంలో ఆ గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు సాహసోపేతంగా వ్యవహరించారు. కళ్ల ముందే బోటు మునిగిపోతుండడం గమనించిన గ్రామస్తులు పడవల సాయంతో తక్షణం అక్కడికి వెళ్లి పలువురిని కాపాడారు. ఆ సమయంలో కచ్చులూరు గ్రామస్తులు తక్షణం స్పందించి ఉండకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. గోదావరి సుడులు తిరుగుతోందని తెలిసినా సాటి మనుషులను కాపాడేందుకు 18 మంది గ్రామస్తులు తమ ప్రాణాలకు తెగించి నదిలోకి వెళ్లారు.

ఇలా ధైర్యంగా స్పందించి పలువురిని కాపాడినందుకు గాను కచ్చులూరు హీరోలను ప్రభుత్వం సత్కరించబోతోంది. కచ్చులూరుకు చెందిన 18 మందికి ఒక్కొక్కరికి 25వేల నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు మీడియాతో చెప్పారు.

బోటు ప్రమాద సమయంలో సాహసోపేతంగా స్పందించిన గిరిజనులకు నగదు ప్రోత్సాహకం అందిస్తే బాగుంటుందని సీఎంవో కార్యాలయ సిబ్బందికి కొందరు శ్రేయోభిలాషులు సూచించారు. దాంతో స్పందించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది.

మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని… అయితే ప్రవాహ ఉధృతి అధికంగా ఉండడం వల్ల అది సాధ్యం కావడం లేదని మంత్రి కన్నబాబు చెప్పారు. మరో 13 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. 13 మంది అచూకీ ఇంకా లభించని నేపథ్యంలో… డెత్ సర్టిఫికేట్ జారీ చేయాల్సిందిగా వారి బంధువులు కోరుతున్నారని ఆ దిశగా జీవో ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

బోటును తీసే సామర్థ్యం తమకు ఉందంటూ కొందరు వస్తున్నారని… వారి ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు కన్నబాబు చెప్పారు. అలాంటి వారు ఎవరైనా జిల్లా అధికారులతో మాట్లాడి ముందుకెళ్లవచ్చని సూచించారు.

First Published:  28 Sep 2019 12:20 AM GMT
Next Story