Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ సినిమాకు మాస్ టైటిల్

మాస్, యాక్షన్ సినిమాలు చేస్తుంటాడు గోపీచంద్. అందుకే అతడి సినిమాలకు మాస్ టైటిల్స్ పడుతుంటాయి. ఈసారి కూడా అలాంటి మాస్ టైటిల్ ఒకటి తెరపైకి వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గోపీచంద్ సినిమాకు సీటీమార్ అనే టైటిల్ అనుకుంటున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. తమన్న హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సీటీమార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాణక్య […]

గోపీచంద్ సినిమాకు మాస్ టైటిల్
X

మాస్, యాక్షన్ సినిమాలు చేస్తుంటాడు గోపీచంద్. అందుకే అతడి సినిమాలకు మాస్ టైటిల్స్ పడుతుంటాయి. ఈసారి కూడా అలాంటి మాస్ టైటిల్ ఒకటి తెరపైకి వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న గోపీచంద్ సినిమాకు సీటీమార్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

సంపత్ నంది దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. తమన్న హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు సీటీమార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చాణక్య సినిమా థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజులకే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

నిజానికి ఈ సీటీమార్ అనే టైటిల్ ఇప్పటిది కాదు. గతంలో రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేస్తున్న టైమ్ లోనే సీటీమార్ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రచ్చ స్థానంలో ఈ టైటిలే పడాలి. కానీ మెగా కాంపౌండ్ మాత్రం రచ్చ టైటిల్ వైపు మొగ్గుచూపింది. అలా తెరవెనక్కు వెళ్లిపోయిన సీటీమార్ టైటిల్ ఇన్నాళ్లకు మరోసారి వెలుగులోకి వచ్చింది. గోపీచంద్ సినిమాకు లాక్ అయింది.

First Published:  28 Sep 2019 6:09 AM GMT
Next Story