Telugu Global
National

ఆర్మీలో డొక్కు హెలికాఫ్టర్ లు.... ఇద్దరు పైలెట్లు మృతి

భూటాన్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఒక ఇండియన్ అర్మీ పైలట్, ఓ రాయల్ భూటాన్ ఆర్మీ పైలట్ మరణించారు. భారతీయ సైన్యానికి చెందిన సింగిల్ ఇంజిన్ చీతా హెలికాప్టర్ అస్సాంలోని మిసామారిలో ఉన్న భారత సైన్యానికి చెందిన 667 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు చెందినది. భూటాన్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ టీమ్‌ దగ్గర పోస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్‌ను అక్కడ వదిలివేసి తిరిగి వస్తున్న ఛాపర్ ప్రమాదానికి గురయింది. భారత్-భూటాన్ల […]

ఆర్మీలో డొక్కు హెలికాఫ్టర్ లు.... ఇద్దరు పైలెట్లు మృతి
X

భూటాన్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఒక ఇండియన్ అర్మీ పైలట్, ఓ రాయల్ భూటాన్ ఆర్మీ పైలట్ మరణించారు. భారతీయ సైన్యానికి చెందిన సింగిల్ ఇంజిన్ చీతా హెలికాప్టర్ అస్సాంలోని మిసామారిలో ఉన్న భారత సైన్యానికి చెందిన 667 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు చెందినది.

భూటాన్‌లో ఉన్న ఇండియన్ ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ టీమ్‌ దగ్గర పోస్ట్ చేసిన ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్‌ను అక్కడ వదిలివేసి తిరిగి వస్తున్న ఛాపర్ ప్రమాదానికి గురయింది.

భారత్-భూటాన్ల మధ్య ఉన్న ఒప్పందంలో భాగంగా… భూటాన్ పైలట్లు 2014-15 నుండి భారత సైన్యంలో శిక్షణ పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన భారత ఆర్మీ పైలట్ లెఫ్టినెంట్-కల్నల్ ర్యాంకుకు చెందినవారని, భూటాన్ ఆర్మీ పైలట్ భారత సైన్యంలో శిక్షణ పొందుతున్నారని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

చీతా ఛాపర్లు 1960ల నాటివి. ఇవి గత 40 సంవత్సరాలుగా భారత సైన్యంలో ఉన్నాయి. వాటి స్థానం లో కొత్త ఛాపర్లను కొనే ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు.

ఒకపక్క మన సైన్యం బలాన్ని ఆకాశానికి ఎత్తుతూ ప్రకటనలు చేస్తూ ఊదరగొడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. మరో పక్క అర్ద శతాబ్ద కాలం నాటి కాలం తీరిన ఛాపర్లను వాడుతున్న భారత సైన్యపు దైన్య స్థితి కనిపిస్తున్నది. సైనికుల ప్రాణాలను ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వాల దేశ భక్తిని ఎట్లా అర్థం చేసుకోవాలి?

లోగుట్టు పెరుమాళ్ కే ఎరుక అన్నట్లు… మన త్రివిధ దళాల్లో ఇంకా ఇటువంటి బలహీనతలు ఎన్ని ఉన్నాయో. ముందు జవాన్లకు కావలసిన సాధన సంపత్తిని ఆధునీకరించి ఆ తర్వాత శతృదేశాలపై ప్రగల్భాలు పలికితే బాగుంటుందని జనం అంటున్నారు.

First Published:  28 Sep 2019 12:26 AM GMT
Next Story