18 ఏళ్లు.. వైరల్ పిక్స్

18 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు స్టూడెంట్ నంబర్-1 థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మనందరం గొప్పగా చెప్పుకుంటున్న రాజమౌళి, దర్శకుడిగా పరిచయమైంది ఇదే సినిమాతో. అలా స్టూడెంట్ నంబర్-1తో దర్శకుడిగా మారిన రాజమౌళి, కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ అన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ 18 ఏళ్లలో 11 సినిమాలు చేసిన రాజమౌళి, ప్రతి సినిమాతో దర్శకుడిగా తనను తాను మెరుగుపరుచుకుంటూనే, ఇండస్ట్రీ హిట్స్ ఇస్తూ వస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి.. అప్పటి స్టూడెంట్ నంబర్-1ను మరోసారి గుర్తుచేసుకున్నాడు. అంతేకాదు.. ఆ సినిమాకు గుర్తుగా కొన్ని పిక్స్ కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

స్టూడెంట్ నంబర్-1 కోసం రామోజీఫిలింసిటీలో షూటింగ్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ కోసం అదే ఫిలింసిటీలో ఉన్నాడు. పైగా అప్పుడు-ఇప్పుడు ఒకే హీరో. అందుకే స్టూడెంట్ నంబర్-1ను గుర్తుచేసుకుంటూ, అప్పటి ఫిలింసిటీ లొకేషన్లలో రాజమౌళి-ఎన్టీఆర్ ఫొటోలు దిగారు. ఆ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.