శ్రీనివాస్ రెడ్డి…. ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’

శ్రీనివాస్ రెడ్డి కి టాలీవుడ్ లో ఒక నటుడిగా మంచి పేరు ఉంది. కమెడియన్ గా చాలా సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీనివాస్ రెడ్డి ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ‘గీతాంజలి’, ‘ఆనందోబ్రహ్మ’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి  ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఈమధ్యనే ‘జంబలకడిపంబ’ సినిమా లో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి…. ఇప్పుడు దర్శకుడు గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిధ్ధమవుతున్నాడు. త్వరలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్ తోనే మంచి ఇంప్రెషన్ ను కలిగించిన శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

అందులో సూటు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని ఫొటో కి పోజ్ ఇస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. సెంటిమెంట్, యాక్షన్ ఉండవు ఓన్లీ కామెడీ అని పోస్ట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి… ఇది ఒక మంచి రసగుల్లా లాంటి సినిమా అని పోస్టర్ ద్వారా చెబుతున్నారు.

దర్శకుడిగా మాత్రమేకాక శ్రీనివాసరెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నాడు. తెలుగు లో ఉన్న ప్రముఖ కమెడియన్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తురు. ఫ్లయింగ్ కలర్స్ గ్రూప్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఫేమ్ పరమ్ సూర్యన్షు ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.