Telugu Global
Cinema & Entertainment

బరువు తగ్గబోతున్న మెగాహీరో

మిస్టర్ సినిమా టైమ్ లో యాక్సిడెంట్ కు గురయ్యాడు వరుణ్ తేజ్. ఆ టైమ్ లో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల బాగా బరువు పెరిగాడు. అయితే అలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. కాస్త లావుగా కనిపిస్తూనే ఈమధ్య సినిమాలన్నీ పూర్తిచేశాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ, తన నెక్ట్స్ సినిమా కోసం ఇంకా తగ్గాలి. అందుకే ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీ అయ్యాడు వరుణ్ […]

బరువు తగ్గబోతున్న మెగాహీరో
X

మిస్టర్ సినిమా టైమ్ లో యాక్సిడెంట్ కు గురయ్యాడు వరుణ్ తేజ్. ఆ టైమ్ లో ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండడం వల్ల బాగా బరువు పెరిగాడు. అయితే అలా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. కాస్త లావుగా కనిపిస్తూనే ఈమధ్య సినిమాలన్నీ పూర్తిచేశాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ, తన నెక్ట్స్ సినిమా కోసం ఇంకా తగ్గాలి. అందుకే ప్రస్తుతం బరువు తగ్గే పనిలో బిజీ అయ్యాడు వరుణ్ తేజ్.

ప్రస్తుతం గద్దలకొండ గణేష్ సినిమా ప్రమోషన్ లో ఉన్నాడు వరుణ్. ఏపీలోని చాలా ప్రాంతాల్ని చుట్టేస్తున్నాడు. విశాఖలో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు. ఈ కార్యక్రమంతో గద్దలకొండ గణేష్ హంగామా పూర్తయినట్టే. ఇకపై ఈ సినిమాతో వరుణ్ కు సంబంధం లేదు. సో.. ఇప్పుడు పూర్తిగా తన ఫిజిక్ పై దృష్టిపెట్టాడు. కనీసం 15 కిలోలు తగ్గాలనేది వరుణ్ తేజ్ ప్లాన్.

వరుణ్ ఇలా డిసైడ్ అవ్వడానికి ఓ రీజన్ కూడా ఉంది. త్వరలోనే బాక్సర్ క్యారెక్టర్ పోషించబోతున్నాడు ఈ మెగా హీరో. అతడి బంధువులే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథ చాలా కొత్తగా ఉంటుందట. పైకి చూడ్డానికి స్పోర్ట్స్ డ్రామాగా కనిపిస్తున్నప్పటికీ, సినిమా అంతా యాక్షన్ నేపథ్యంలో ఉంటుందట. పైగా వరుణ్ చాలా చోట్ల షర్ట్ లేకుండా కూడా కనిపించాలట. ఇలాంటి పాత్ర చేయాలంటే కచ్చితంగా తగ్గాల్సిందే. అందుకే వరుణ్ త్వరలోనే జిమ్ బాట పట్టబోతున్నాడు.

First Published:  28 Sep 2019 12:14 AM GMT
Next Story