Telugu Global
National

కొత్తగా నాలుగు పోర్టుల అభివృద్ధికి ఏపీ నిర్ణయం

సముద్ర మార్గం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వరంగా ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఆసరగా చేసుకుని అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా రానున్న కాలంలో ఓడల ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. దీని వల్ల బ్లూ ఎకానమీ ఆదాయం కూడా రెట్టింపు కానుంది. ప్రస్తుతం ఏటా 170 మిలియన్ టన్నులుగా కార్గో సామర్థ్యం ఉంది. దీన్ని 2024 నాటికి […]

కొత్తగా నాలుగు పోర్టుల అభివృద్ధికి ఏపీ నిర్ణయం
X

సముద్ర మార్గం ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి వరంగా ఉన్న 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఆసరగా చేసుకుని అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తోంది.

ఇందులో భాగంగా రానున్న కాలంలో ఓడల ద్వారా సరుకు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించుకుంది. దీని వల్ల బ్లూ ఎకానమీ ఆదాయం కూడా రెట్టింపు కానుంది.

ప్రస్తుతం ఏటా 170 మిలియన్ టన్నులుగా కార్గో సామర్థ్యం ఉంది. దీన్ని 2024 నాటికి 290 మిలియన్ టన్నులకు, 2029 నాటికి 570 మిలియన్ టన్నులకు చేర్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

కార్గో సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ఇప్పుడున్న విశాఖ, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్ పోర్టులకు అదనంగా మచిలీపట్నం , రామాయపట్నం, వాడరేవు, భావనపాడు పోర్టులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వీటి అభివృద్ధిని వేగంగా చేసేందుకు ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయనున్నారు.

సముద్రంలో చేపల ఆదాయంపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి చేపలు పట్టే హక్కు ఉన్నా… అంతదూరం వెళ్లేందుకు అవసరమైన బోట్లు అందుబాటులో లేవు. కేవలం 40 నుంచి 50 నాటికల్ మైళ్ల వరకు మాత్రమే మన వాళ్లు వెళ్లగలుగుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎక్కువ దూరం వరకు ప్రయాణం చేయగలిగే బోట్లను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా సముద్రంలో దూరంగా వెళ్లడం వల్ల డిమాండ్ ఉన్న టూనా, షార్క్ లాంటి చేపలు అధికంగా దొరికే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అత్యధిక కార్గో రవాణా విశాఖ పోర్టు నుంచి (120 మిలియన్ టన్నులు), గంగవరం పోర్టు (64 మిలియన్ టన్నులు) నుంచి సాగుతోంది.

First Published:  28 Sep 2019 8:30 PM GMT
Next Story