చంద్రబాబుకు రహస్య గది ఉంది… రాత్రి పూట ఒక్కడే అక్కడికి వెళ్తాడు…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరకట్ట నివాసంలో అక్రమంగా డబ్బు దాచుకున్నారని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇంట్లో భారీగా డబ్బులు దాచుకోవడం చంద్రబాబుకు తొలి నుంచి ఉన్న అలవాటేనన్నారామె.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఒక నేలమాళిగను నిర్మించారన్నారు. చంద్రబాబుకు అత్యంత రహస్యంగా ఒక చిన్న గది ఉందని వివరించారు. రాత్రి పూట మాత్రమే చంద్రబాబు ఒక్కరే ఆ గదిలోకి వెళ్తారని ఆమె చెప్పారు. తన లక్షల కోట్ల అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని ఆ గది నుంచే చంద్రబాబు నడుపుతుంటారని వ్యాఖ్యానించారు.

ఆ గది కొందరికి తప్పించి మరెవ్వరికీ తెలియదన్నారు లక్ష్మీపార్వతి. కానీ ఏదో ఒక రోజు ఆ గది బయటపడి తీరుతుందని … అప్పుడు చంద్రబాబు బండారం మొత్తం బయటపడుతుందన్నారు.