Telugu Global
Cinema & Entertainment

టీజర్ తోనే భయపెడుతున్న 'ఆవిరి'

ఇండస్ట్రీలో ఉన్న మిగతా దర్శకులతో పోలిస్తే రవిబాబు సినిమాలు కొత్తగా ఉంటాయి. ‘అనసూయ’, ‘నచ్చావులే’ వంటి హిట్ సినిమాలను అందించిన రవిబాబు ‘అవును’ అనే హారర్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఇప్పుడు ఈ మధ్యనే ‘అదుగో’ అనే సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న రవి బాబు ఇప్పుడు ‘ఆవిరి’ అనే మరొక హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన  రవిబాబు తాజాగా ఈ […]

టీజర్ తోనే భయపెడుతున్న ఆవిరి
X

ఇండస్ట్రీలో ఉన్న మిగతా దర్శకులతో పోలిస్తే రవిబాబు సినిమాలు కొత్తగా ఉంటాయి. ‘అనసూయ’, ‘నచ్చావులే’ వంటి హిట్ సినిమాలను అందించిన రవిబాబు ‘అవును’ అనే హారర్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

తాజాగా ఇప్పుడు ఈ మధ్యనే ‘అదుగో’ అనే సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న రవి బాబు ఇప్పుడు ‘ఆవిరి’ అనే మరొక హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రవిబాబు తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

రాజ్ కుమార్ మరియు అతని కుటుంబం ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. వీరితో పాటు ఒక ఆత్మ కూడా ఇక్కడే ఉంటది. మీరు ఆ ఆత్మ ని కనిపెట్టండి అని సవాలు విసిరి ఇంట్లో వస్తువులు వాటంతట అవే కదిలిపోతున్నట్టు చూపించాడు రవి బాబు. ఆఖరిలో రవిబాబు ఎంట్రీ కూడా ఉంటుంది.

టీజర్ తోనే భయపెడుతున్న రవి బాబు…. సినిమాతో కూడా మరింత భయపెట్టనున్నాడని తెలుస్తోంది. నేహా చౌహన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ మరియు రవి బాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రవి బాబు స్వయంగా ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  29 Sep 2019 12:16 PM GMT
Next Story