Telugu Global
Cinema & Entertainment

హాట్ పోస్టర్ తో 'రొమాంటిక్' గా ఆకాష్ పూరి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఆకాష్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాడు. తాజాగా ఇప్పుడు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్నాడు. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆకాష్ ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. […]

హాట్ పోస్టర్ తో రొమాంటిక్ గా ఆకాష్ పూరి
X

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘మెహబూబా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఆకాష్ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాడు.

తాజాగా ఇప్పుడు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్నాడు. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆకాష్ ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇంటర్నెట్ బ్యూటీ కేతికా శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘రొమాంటిక్’ ఒక ఇంటెన్స్ ప్రేమ కథ అంటూ ఈ పోస్టర్ ని షేర్ చేశాడు పూరి జగన్నాధ్.

పోస్టర్లో హీరోయిన్ కేతిక శర్మ ని గట్టిగా హత్తుకుని కనిపిస్తున్నాడు ఆకాష్ పూరి. పోస్టర్ బోల్డ్ గా ఉండడంతో సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. చూడాలి ఆకాష్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

First Published:  30 Sep 2019 3:18 AM GMT
Next Story