రష్యన్ గ్రాండ్ ప్రీ విజేత లూయి హామిల్టన్

  • టీమ్ ఫెరారీ విజయాలకు టీమ్ మెర్సిడెస్ చెక్ 
  • 73 పాయింట్ల ఆధిక్యంలో లూయి హామిల్టన్

2019 ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ సీజన్లో టీమ్ ఫెరారీ వరుస విజయాలకు…టీమ్ మెర్సిడెస్ ఎట్టకేలకు బ్రేక్ వేయగలిగింది.

సోచీ వేదికగా జరిగిన రష్యన్ గ్రాండ్ ప్రీ టైటిల్ రేస్ లో టీమ్ మెర్సిడెస్ రేసర్లు లూయి హామిల్టన్, వాల్టెర్రీ బోట్టాస్ మొదటి రెండు స్థానాలు సొంతం చేసుకొన్నారు. ఫెరారీ రేసర్ చార్లెస్ లెక్ లెర్క్ మూడో స్థానంతో సరిపెట్టుకొన్నాడు.

ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెట్టల్ మొత్తం 53 ల్యాప్ ల రేస్ లో 28వ ల్యాప్ కే సాంకేతిక కారణాలతో ఉపసంహరించుకొన్నాడు.

విజేతగా నిలిచిన హామిల్టన్ కెరియర్ లో ఇది 82వ టైటి్ల్ కాగా…ప్రస్తుత సీజన్లో తొమ్మిదో విజయం కావడం విశేషం.

బహుమతి ప్రదాన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.