Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ తో సినిమాపై స్పందించిన చిరంజీవి

మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పీరియడ్ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే చిరంజీవి… త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఒక సినీ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ… తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాను అని ప్రస్తావించటం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ‘సై రా’ ప్రమోషన్స్ లో […]

త్రివిక్రమ్ తో సినిమాపై స్పందించిన చిరంజీవి
X

మెగా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పీరియడ్ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే చిరంజీవి… త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్త ఎప్పటినుంచో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఒక సినీ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ… తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాను అని ప్రస్తావించటం అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం ‘సై రా’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా గురించి కూడా రియాక్ట్ అయ్యాడు.

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక లైన్ చెప్పడం జరిగిందని, ప్రస్తుతం దానిమీద వర్క్ జరుగుతుందని చెప్పాడు చిరంజీవి.

అంతేకాకుండా ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైనర్ అని కూడా చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

అయితే ‘సైరా’ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి…. కొరటాల శివ దర్శకత్వం చేయబోయే సినిమాని నవంబర్ నుంచి మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

First Published:  30 Sep 2019 2:03 AM GMT
Next Story