Telugu Global
Cinema & Entertainment

మోహన్ లాల్ సినిమా రీమేక్ లో మెగాస్టార్ !

మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ అనే సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటారు. వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు తోవిన్ థామస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్స్ […]

మోహన్ లాల్ సినిమా రీమేక్ లో మెగాస్టార్ !
X

మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ అనే సినిమా మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటారు.

వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు తోవిన్ థామస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్స్ సందర్భంలో వెల్లడించారు. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ మూవీ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు.

తెలుగులో శ్రీకాంత్ నటించిన ‘పోలీస్ పోలీస్’ సినిమాలో విలన్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ మెగాస్టార్ ‘సైరా’ సినిమాలో కూడా నటించాల్సి ఉందట… కానీ డేట్స్ కుదరక పోవడంతో సినిమా చేయలేకపోయాడట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు పృథ్వీరాజ్.

“సైరా నరసింహారెడ్డి కేరళ లాంచ్ ఈవెంటలో చిరంజీవి సర్ తో ఉన్నాను. నా ‘లుసిఫర్’ సినిమా రీమేక్ రైట్స్ ను ఆయన కొనుగోలు చేసినందుకు చాలా థ్రిల్ అయ్యాను. సైరా నరసింహారెడ్డి సినిమా లో నటించే అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో నేను ఎప్పటికీ పశ్చాత్తాప పడుతూ ఉంటాను” అని పోస్ట్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్.

First Published:  30 Sep 2019 5:21 AM GMT
Next Story