Telugu Global
NEWS

బోటు యజమాని నుంచే 22 లక్షలు వసూలు

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన పడవను బయటకు తీసుకుందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బోటును తాము బయటకు తీస్తామని ముందుకొచ్చిన ధర్మాడ సత్యం బృందం ఘటన స్థలికి చేరుకుంది. రెండు గంటల్లోనే బోటును బయటకు తీస్తానంటూ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వెంకట శివ అనే వ్యక్తిని కూడా ఈ బృందానికి తోడు చేశారు. ఈ బోటు వెలికితీత పనిని 22.7 లక్షలకు సత్యం బృందానికి కలెక్టర్ అప్పగించారు. ఈ 22.7 లక్షల సొమ్మును బోటు యజమాని […]

బోటు యజమాని నుంచే 22 లక్షలు వసూలు
X

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన పడవను బయటకు తీసుకుందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బోటును తాము బయటకు తీస్తామని ముందుకొచ్చిన ధర్మాడ సత్యం బృందం ఘటన స్థలికి చేరుకుంది. రెండు గంటల్లోనే బోటును బయటకు తీస్తానంటూ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వెంకట శివ అనే వ్యక్తిని కూడా ఈ బృందానికి తోడు చేశారు.

ఈ బోటు వెలికితీత పనిని 22.7 లక్షలకు సత్యం బృందానికి కలెక్టర్ అప్పగించారు. ఈ 22.7 లక్షల సొమ్మును బోటు యజమాని అయిన బాలాజీ మెరైన్స్ సంస్థ నుంచే వసూలు చేసి ధర్మాడ సత్యం బృందానికి చెల్లిస్తారు.

ఇలా చేయడం ద్వారా నిబంధనలకు విరుద్దంగా ఇష్టానుసారం వ్యవహరించే ప్రైవేట్ బోటు యాజమాన్యాలకు ఒక హెచ్చరికగా ఉంటుందని భావిస్తున్నారు. ఆదివారం భారీ గొలుసులు, తాళ్లు, జేసీబీలతో సత్యం బృందం అక్కడికి చేరుకుంది. సోమవారం నుంచి వెలికి తీత ప్రయత్నాలు మొదలుపెడుతామని సత్యం చెప్పారు. ప్రస్తుతం పడవ 315 అడుగుల లోతులో కూరుకుపోయింది. మునిగిపోయిన పడవకు లంగరు వేయడం ద్వారా దాన్ని కదిలిస్తామని సత్యం బృందం వెల్లడించింది.

ఈ బోటులోని ఏసీ చాంబర్‌లో మరికొందరు చిక్కుకుపోయి చనిపోయినట్టు భావిస్తున్నారు. పడవను వెలికి తీస్తే వారి మృతదేహాలు దొరకవచ్చు. ఇంకా 13 మంది టూరిస్టుల ఆచూకీ తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ బోటులో వాడిన లైఫ్ జాకెట్లు కూడా నాణ్యమైనవి కావని గుర్తించారు. కొందరు లైఫ్ జాకెట్లు ఉన్నా సరే చనిపోయారు. అలాంటి వారి మృతదేహాలకు ఉన్న లైఫ్ జాకెట్లను పరిశీలించగా అవి ప్రమాద సమయంలో వ్యక్తులను రక్షించే స్థాయిలో లేవని అధికారులు తేల్చారు.

పోలీసుల తనిఖీల సమయంలో చూపించడానికి నామమాత్రంగా నాసిరకం, పాతబడిన , దెబ్బతిన్న లైఫ్ జాకెట్లను కూడా బోటులో వాడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై బోట్లలో లైఫ్ జాకెట్ల నాణ్యతలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

First Published:  29 Sep 2019 8:12 PM GMT
Next Story