Telugu Global
Cinema & Entertainment

నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ అదే

చాణక్య సినిమా షూటింగ్ టైమ్ లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి తొలిసారిగా మీడియా ముందు మాట్లాడాడు హీరో గోపీచంద్. షూటింగ్స్ టైమ్ లో తనకు చాలా యాక్సిడెంట్స్ జరిగాయని, జయం సినిమా టైమ్ నుంచి తనకు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉందని చెప్పిన గోపీచంద్… చాణక్య టైమ్ లో జరిగిన ప్రమాదం మాత్రం తన జీవితంలో జరిగిన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకొచ్చాడు. “ఆరోజు ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. నిజానికి ఆ ఫైట్ కు […]

నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ అదే
X

చాణక్య సినిమా షూటింగ్ టైమ్ లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి తొలిసారిగా మీడియా ముందు మాట్లాడాడు హీరో గోపీచంద్. షూటింగ్స్ టైమ్ లో తనకు చాలా యాక్సిడెంట్స్ జరిగాయని, జయం సినిమా టైమ్ నుంచి తనకు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉందని చెప్పిన గోపీచంద్… చాణక్య టైమ్ లో జరిగిన ప్రమాదం మాత్రం తన జీవితంలో జరిగిన అతిపెద్ద ప్రమాదంగా చెప్పుకొచ్చాడు.

“ఆరోజు ఓ ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నాం. నిజానికి ఆ ఫైట్ కు సంబంధించి ఆల్రెడీ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. రిస్కీ షాట్స్ అన్నీ తీసేశాం. ఇంకో చిన్న షాట్ మాత్రమే పెండింగ్ ఉంది. అదే టైమ్ లో యాక్సిడెంట్ అయింది. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి బైక్ తీయాల్సిన షాట్ అది. వెనక నుంచి ఛేజ్ ఉంటుంది. నా సౌలభ్యం కోసం అప్పటికే బైక్ ను స్టార్ట్ చేసి ఉంచారు. కాకపోతే ఆ బైక్ కాస్త ఇబ్బందిపెడుతోంది. నేను పరుగెత్తుకుంటూ వచ్చి బైక్ రైజింగ్ ఇచ్చాను. అది ఒక్కసారిగా ఫుల్ రైజింగ్ లోకి వెళ్లిపోయింది. ముందు టైర్ గాల్లోకి లేచింది. ఎదురుగా రెండు కెమెరాలు, కెమెరామెన్లు ఉన్నారు. నేను బైక్ వదిలేస్తే వాళ్లకు దెబ్బలు తగులుతాయి. అందుకే నియంత్రించడానికి ప్రయత్నించాను. కానీ క్షణాల్లో యాక్సిడెంట్ అయిపోయింది. పెద్ద దెబ్బ తగిలింది.”

ఇలా తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరంగా చెప్పుకొచ్చాడు గోపీచంద్. రక్తం కారుతూ అలానే 3 గంటల పాటు ప్రయాణించి జైపూర్ కు వెళ్లి సర్జరీ చేయించుకున్నానని స్పష్టంచేశాడు. చాణక్య సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. తన యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమాను మాత్రం జీవితంలో మరిచిపోలేనంటున్నాడు గోపీచంద్.

First Published:  29 Sep 2019 10:24 PM GMT
Next Story