Telugu Global
National

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం

2002 గుజరాత్ అల్లర్ల బాధితురాలు బానోకు రెండు వారాల్లో 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని భారత సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 న గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మునుపటి నిర్ణయాన్ని తిరిగి పరిశీలించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని… బానోకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగం, గృహ వసతి కల్పించాలని ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా…సుప్రీం కోర్టు ఏప్రిల్ మాసం […]

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశం
X

2002 గుజరాత్ అల్లర్ల బాధితురాలు బానోకు రెండు వారాల్లో 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని భారత సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 న గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మునుపటి నిర్ణయాన్ని తిరిగి పరిశీలించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వాన్ని… బానోకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగం, గృహ వసతి కల్పించాలని ఆదేశించింది.

గుజరాత్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా…సుప్రీం కోర్టు ఏప్రిల్ మాసం లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరారు.

ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని.. బానోకు పరిహారం చెల్లించాలని, ఆమెకు ఉద్యోగం, వసతి కల్పించాలని ఆదేశించింది.

గోద్రా అల్లర్ల తరువాత బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేసినందుకు 11 మందిని… 2008 జనవరి 21 న ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అలాగే పోలీసులు, వైద్యులతో సహా ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.

First Published:  30 Sep 2019 5:59 AM GMT
Next Story