శాఫ్ అండర్ -18 ఫుట్ బాల్ విజేత భారత్

  • ఫైనల్లో బంగ్లాదేశ్ పై 2-1 గోల్స్ తో గెలుపు

దక్షిణాసియా సమాఖ్య దేశాల అండర్ -18 ఫుట్ బాల్ టైటిల్ ను భారత్ తొలిసారిగా గెలుచుకొంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 2-1 గోల్స్ తో బంగ్లాదేశ్ ను అధిగమించింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన టైటిల్ సమరం ప్రారంభమైన రెండో నిముషంలోనే విక్రమ్ ప్రతాప్ సింగ్ భారత్ కు తొలిగోల్ తో 1-0 ఆధిక్యం అందించాడు.

ఆ తర్వాత ఈక్వలైజర్ కోసం పోరాడిన బంగ్లాదేశ్ కు ఆట 40వ నిముషంలో యాసిన్ అరాఫత్ ద్వారా స్కోరును 1-1తో సమం చేయగలిగింది. ఆట ముగిసే క్షణాలలో రవి బహదూర్ రాణా మెరుపు గోల్ తో భారత్ 2-1 గోల్స్ తో విజేతగా నిలిచింది.

సెమీఫైనల్స్ లో మాల్దీవ్స్ ను 4-0 గోల్స్ తో చిత్తు చేసిన భారత్… ప్రస్తుత టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

ఇప్పటికే అండర్ -15 విభాగంలో సైతం బంగ్లాదేశ్ ను ఓడించడం ద్వారా చాంపియన్ గా నిలిచిన భారత్… ఇప్పుడు అండర్ -18 విభాగంలోనూ విన్నర్ కాగలిగింది.

భారత ఆటగాడు నితోయిన్ గోంబీ మీటీకి టోర్నీ అత్యుత్తమ ఆటగాడి అవార్డు దక్కింది.