Telugu Global
NEWS

తీహారు జైలులో నెలరోజుల నరకం

ఏడవని రోజు లేదంటూ శ్రీశాంత్ లబోదిబో గతాన్ని గుర్తు చేసుకొన్న భారత మాజీ క్రికెటర్ భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తీహారు జైలులో గడిపిన రోజులను గుర్తు చేసుకొని మరోసారి బావురుమన్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన సమయంలో శ్రీశాంత్ మరో ఇద్దరు సహ ఆటగాళ్లతో కలసి స్పాట్ ఫిక్సింగ్ లో చిక్కుకొన్నాడు. అంతేకాదు…తీహారు జైలు పాలయ్యాడు. హత్యలు, మానభంగాలు చేసిన కరుడుగట్టిన నేరస్థులను ఉంచిన గదుల్లోనే తనను ఖైదు చేసి..ప్రత్యక్ష […]

తీహారు జైలులో నెలరోజుల నరకం
X
  • ఏడవని రోజు లేదంటూ శ్రీశాంత్ లబోదిబో
  • గతాన్ని గుర్తు చేసుకొన్న భారత మాజీ క్రికెటర్

భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై తీహారు జైలులో గడిపిన రోజులను గుర్తు చేసుకొని మరోసారి బావురుమన్నాడు.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన సమయంలో శ్రీశాంత్ మరో ఇద్దరు సహ ఆటగాళ్లతో కలసి స్పాట్ ఫిక్సింగ్ లో చిక్కుకొన్నాడు. అంతేకాదు…తీహారు జైలు పాలయ్యాడు.

హత్యలు, మానభంగాలు చేసిన కరుడుగట్టిన నేరస్థులను ఉంచిన గదుల్లోనే తనను ఖైదు చేసి..ప్రత్యక్ష నరకం చూపించారని వాపోయాడు.

తన సహ ఖైదీ చీటికిమాటికి తిడుతూ ఉండేవాడని… గదిలో తెల్లవార్లూ లైటు వెలుగుతూ ఉండడంతో తనకు కంటిమీద కునుకే ఉండేది కాదని… కారణం లేకుండానే ఏడుపు వచ్చేదని… జైలు శిక్ష అనుభవించిన నెలరోజులూ ఏడుస్తూనే గడిపానని..గతాన్ని గుర్తు చేసుకొన్నాడు.

భారత్ తరపున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడిన శ్రీశాంత్ చివరిసారిగా 2011 సీజన్లో తన ఆఖరిమ్యాచ్ ఆడాడు. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారతజట్టు 2007 ప్రపంచకప్ నెగ్గడంలో సైతం శ్రీశాంత్ ప్రధానపాత్ర వహించాడు.

సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత శ్రీశాంత్ పైన విధించిన జీవితకాల నిషేధం శిక్షను సుప్రీంకోర్టు 7 సంవత్సరాలకు తగ్గించింది. 2020తో శ్రీశాంత్ పై విధించిన నిషేదం ముగియనుంది.

First Published:  30 Sep 2019 12:12 AM GMT
Next Story