అలీసా హేలీ 100 మ్యాచ్ ల టీ-20 రికార్డు

  • 100 మ్యాచ్ ల క్లబ్ లో 9వ మహిళా క్రికెటర్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో వంద మ్యాచ్ లు ఆడిన మహిళా క్రికెటర్ల సంఖ్య ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. ప్రస్తుత సీజన్లో వందమ్యాచ్ ల క్లబ్ లో చేరిన మహిళల సంఖ్య తొమ్మిదికి చేరింది.

శ్రీలంకతో జరుగుతున్న తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరిగిన రెండోమ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా కంగారూ వికెట్ కీపర్ బ్యాట్స్ విమెన్ అలీసా హేలీ వంద మ్యాచ్ ల మైలురాయిని చేరింది. ఎల్సీ పెర్రీ వందమ్యాచ్ లు ఆడిన కంగారూ తొలి మహిళా క్రికెటర్ కాగా…అలీసా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

టీ-20 ఫార్మాట్లో వంద మ్యాచ్ లు ఆడిన ఆస్ట్ర్రేలియా రెండో మహిళగా…ఓవరాల్ గా తొమ్మిదో మహిళా క్రికెటర్ గా అలీసా హేలీ రికార్డుల్లో చేరింది.

గత మహిళా టీ-20 ప్రపంచకప్ లో అత్యుత్తమ క్రికెటర్ అవార్డు గెలుచుకొన్న 29 ఏళ్ల అలీసా…గత ఏడాదే ఐసీసీ టీ-20 బెస్ట్ ప్లేయర్ అవార్డును సైతం అందుకొంది.

2010 సీజన్లో 19 సంవత్సరాల వయసులో టీ-20 అరంగేట్రం చేసిన అలీసాకు…వంద మ్యాచ్ లు ఆడటానికి దశాబ్దకాలం పట్టడం విశేషం.

హేలీకీ ఇప్పటి వరకూ ఆడిన 100 మ్యాచ్ ల్లోల 9 హాఫ్ సెంచరీలతో సహా 1661 పరుగులు సాధించిన రికార్డు ఉంది.