బాలకృష్ణ …. వెనక్కి తగ్గినట్లేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105 వ సినిమా కి సంబందించిన షూటింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. కె ఎస్ రవి కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ హీరో-దర్శకుడు కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం. ఈ సినిమా ని మొదటగా సంక్రాంతి పండుగ కి విడుదల చేయాలని భావించారు చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే సంక్రాంతి కి పలు పెద్ద చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటించిన తరుణం లో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల విషయం లో వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం చిత్ర యూనిట్ కి ఈ సినిమా విడుదల విషయం లో ఒక పక్కా ప్రణాళిక లేదని తెలుస్తోంది. సినిమా కి పని చేస్తున్న కొంత మంది చెప్తున్న దాని ప్రకారం ఈ సినిమా ని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని కొందరు అంటుండగా, మరి కొందరేమో ఈ సినిమా ని జనవరి చివరి వారం లో కానీ ఫిబ్రవరి నెల లో కానీ విడుదల చేయాలి అని నిర్మాతకి సూచన చేశారట.

అయితే షూటింగ్ విషయం లో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా…. సమయానికి సినిమా ని పూర్తి చేసే విధం గా యూనిట్ పని చేస్తుంది.